జగన్ కి జాతకాల పిచ్చి ..అందుకే రాజధాని మార్పు !

Update: 2020-01-08 05:05 GMT
ఆంధప్రదేశ్ పరిపాలన రాజధాని గా విశాఖపట్నం మారడానికి మరెన్నో రోజులు లేవు. మూడు రాజధానుల నిర్ణయం పై ప్రభుత్వం వెనుకడువేసేలా కనిపించడం లేదు. దీనితో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. రైతులు ఆందోళనలు చేస్తున్నప్పటికీ ..వారికీ అన్ని విధాలా సహాయంగా నిలుస్తాం అని చెప్తూ విశాఖ కి మార్చే విధంగా అడుగులు వేస్తున్నారు. ఈ తరుణంలో ఏపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి జవహర్ ఈ మూడు రాజధానుల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ జాతకాల పిచ్చితోనే రాజధానిని మార్చుతున్నారని.. విశాఖ శారదాపీఠం స్వామి స్వరూపానందేంద్ర ఆలోచన తోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు.

జగన్ కి జాతకాల పిచ్చి పట్టింది అని , జగన్ జాతకాల పిచ్చితో ఇటు హిందువులను, అటు క్రైస్తవులను మోసం చేస్తున్నారని విమర్శించారు. జగన్ రాజధానిని విశాఖకు మార్చడం వెనుక స్వరూపానంద సరస్వతి సలహా ఉండొచ్చని అయన ఒక సందేహం వ్యక్తం చేశారు. అలాగే జగన్ జాతకాల పిచ్చితో ఏపీలో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజలను కష్టాల్లోకి నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొన్నిరోజుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ తో జగన్ భేటీ అవుతుండడం పట్ల జవహర్ స్పందించారు. హైదరాబాద్ కు మేలు చేసే మరో ఒప్పందం కుదుర్చుకునేందుకే కేసీఆర్ తో సమావేశమవుతున్నారని ఆరోపించారు.

రాజధాని రైతుల ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వ విప్ పిన్నెల్లి పై దాడి జరగడం, టీడీపీ నేతల అరెస్టు పరిణామాల పైనా కొంచెం ఘాటుగా స్పందించారు. రైతులు శాంతియుతం గా ధర్నా చేస్తుంటే కుట్ర పూరితంగా పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అక్కడికి వచ్చారని , బూతులు మాట్లాడడం లో పిన్నెల్లి మంత్రి కొడాలి నానిని మించిపోయారంటూ ఎద్దేవా చేశారు. అందుకే పిన్నెల్లి నోరు కడుక్కోవడానికి యాసిడ్ పంపిస్తానని అన్నారు. అధికార పార్టీ నేతలు బూతులు మాట్లాడడం మానేసి బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు.


Tags:    

Similar News