అమ్మ అనారోగ్యం వెనుక సంచ‌ల‌న నిజం

Update: 2017-12-13 04:42 GMT
అమ్మ‌గా త‌మిళుల మ‌న్న‌న‌లు పొందిన దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత అనారోగ్యానికి గురి కావ‌టం.. చెన్నై అపోలో లో చేర‌టం.. మ‌ర‌ణం త‌ర్వాతే ఆసుప‌త్రి నుంచి బ‌య‌ట‌కు రావ‌టం తెలిసిందే. అమ్మ మ‌రణంపై ప‌లువురు సందేహాలు వ్య‌క్తం చేయ‌టమే కాదు తెలీని మిస్ట‌రీ ఏదో ఉంద‌న్న భావ‌న ప‌లువురిలో ఉంది. ఈ నేప‌థ్యంలో అమ్మ  మృతిపై విచార‌ణ క‌మిష‌న్‌ను ఏర్పాటు చేశారు.

తాజాగా జ‌రిగిన విచార‌ణ‌లో సంచ‌ల‌న నిజం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. అనారోగ్యంతో ఉన్న అమ్మ‌ను అపోలో ఆసుప‌త్రికి తీసుకొచ్చిన స‌మ‌యంలోనే ఆమె తీవ్ర‌మైన అనారోగ్యంతో పాటు.. మోతాదుకు మించిన స్టెరాయిడ్లు ఇచ్చిన విష‌యాన్ని గుర్తించినట్లుగా అక్యుపంక్చ‌ర్ వైద్య నిపుణులు శంక‌ర్ వెల్ల‌డించారు. విచార‌ణ క‌మిష‌న్ ముందు హాజ‌రైన ఆయ‌న‌.. వారు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇచ్చే క్ర‌మంలో  ఈ సంచ‌ల‌న నిజాన్ని బ‌య‌ట‌పెట్టారు.

అపోలో ఆసుప‌త్రికి తీసుకురావ‌టానికి ముందే పోయెస్ గార్డెన్ లోని అమ్మ వేద‌నిల‌యంలోనే చికిత్స నిర్వ‌హించార‌ని.. ఆ సంద‌ర్భంలో మోతాదు మించిన స్టెరాయిడ్స్ వాడిన‌ట్లుగా గుర్తించిన‌ట్లుచెప్పారు.

అమ్మ‌కు గ‌తంలోనూ అక్యుపంక్చ‌ర్ చేసిన అనుభ‌వం ఉన్న వైద్యులు శంక‌ర్ మాట్లాడుతూ.. గ‌త ఏడాద సెప్టెంబ‌రు 22న రాత్రి అమ్మ అస్వ‌స్థ‌త‌కు గురైన వెంట‌నే ప్రాథ‌మిక చికిత్స‌లు అందించిన‌ట్లు చెప్పారు. ఆ సంద‌ర్భంలోనే ఆమెకు మోతాదుకు మించిన స్టెరాయిడ్స్ వాడిన‌ట్లుగా గుర్తించామ‌న్నారు. అన‌వ‌స‌రంగా స్టెరాయిడ్స్ వాడటం మొద‌టికే మోసం వ‌స్తుంద‌న్న విష‌యం సామాన్యుల‌కే తెలిసిన‌ప్పుడు.. సీఎం స్థానంలో ఉన్న జ‌య‌కు ఎలా వాడార‌న్న‌ది ప్ర‌శ్న‌? అంత ఎక్కువ మోతాదులో స్టెరాయిడ్స్ వాడ‌టాన్ని ఎవ‌రి సూచ‌న మేర‌కు చేశార‌న్న ప్ర‌శ్న‌లు ఇప్పుడు తెర మీద‌కు వ‌చ్చాయి. రానున్న రోజుల్లోజ‌రిపే విచార‌ణ మ‌రిన్ని సంచ‌ల‌న అంశాల్ని తెర మీద‌కు తేవొచ్చ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.
Tags:    

Similar News