అతిగా టాబ్లెట్స్ వినియోగం ఆరోగ్యానికి ప్రమాదకరం

Update: 2021-12-02 00:30 GMT
అసలే ఇది కరోనా కాలం. దీనికి తోడు ఏ చిన్న జలుబు, దగ్గు వచ్చిన సరే వెంటనే మనం అప్రమత్తమై ఇందుకు సంబంధించిన ఏదో ఒక టాబ్లెట్ ను వేసుకుంటున్నాం. ముఖ్యంగా ఆంటీ బయాటిక్స్ ను అలవాటు చేసుకుంటున్నాం. అయితే ఇది చాలా ప్రమాదం అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రతిదానికి మాత్రలను విచ్చలవిడిగా తీసుకోవడం తగ్గించాలని చెప్తున్నారు. ఇలా తీసుకోవడం వల్ల అవి వాటి ప్రభావాన్ని కోల్పోయి మనిషి శరీరంపై పని చేయడం తగ్గిపోతుందని అభిప్రాయపడ్డారు. అందుకే శరీరానికి ఎక్కువ మోతాదులో టాబ్లెట్లను అలవాటు చేయడం మానుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా జబ్బు చేసిన వెంటనే సంబంధిత వైద్యుణ్ణి సంప్రదించి అతని నుంచి ప్రిస్క్రిప్షన్ తీసుకోవాలని సూచిస్తున్నారు. డాక్టర్ సూచించి ఇచ్చిన టాబ్లెట్స్ లను మాత్రమే వేసుకోవాలని పేర్కొన్నారు.

మార్కెట్లో డజనుకు పైగా యాంటీ బయోటిక్స్ టాబ్లెట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటి వాడకం ఎక్కువ అయితే చివరకు మానవుని శరీరానికి హాని కలుగుతుంది. మనిషి శరీరంలో ఉండే మంచి యాంటీబాడీలను కూడా ఇవి నాశనం చేసి ఆఖరికి టాబ్లెట్ల పనితీరుని ప్రశ్నార్థకం చేస్తున్నాయి.

శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం నిర్ణీత మోతాదులో వేసుకోవాలి... లేకపోతే అవి ఆరోగ్యానికి తీవ్రమైన హాని చేస్తాయని పేర్కొన్నారు. మందుల వాడకం పై ఇప్పటికే వివిధ రకాలుగా అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు వైద్య అధికారులు చెబుతున్నారు. ట్యాబ్లెట్లను విక్రయించే దుకాణాలకు ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసినట్లు పేర్కొన్నారు. వాస్తవానికి యాంటీ బయోటిక్స్ ను ఏ ఉద్దేశంతో అయితే వైద్య రంగానికి పరిచయం చేశారో... అది నెరవేరకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

శరీరంలో చెడు బ్యాక్టీరియా తో పాటు మనకి మంచి చేసే బ్యాక్టీరియా కూడా ఉంటుంది. అయితే యాంటీ బయోటిక్స్ వాడకం వల్ల ఇవి శరీరంలో చనిపోతున్నాయి. ఈ కారణంగా కరోనా లాంటి మహమ్మారిని ముందుండి పోరాడడానికి అవసరమైన బ్యాక్టీరియా చనిపోతుందని వైద్యులు చెప్తున్నారు. ఇటువంటి క్లిష్ట సమయాల్లో అవసరానికి మించిన డ్రగ్ ని తీసుకోవడం ఎట్టిపరిస్థితుల్లోనూ సరైనది కాదని సూచిస్తున్నారు. ప్రతి చిన్న దానికి టాబ్లెట్లను ఉపయోగించకుండా కనీసం 12 గంటలు వరకు చూసి..

ఆ తరువాత టాబ్లెట్ వేసుకోవడం మంచిది అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా వీలైనంత వరకు అన్ని రకాల జబ్బులకు టాబ్లెట్స్ బదులుగా ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నయేమో అని అన్వేషించాలి. ఉదాహరణకు జలుబు చేసినప్పుడు ఆవిరి పట్టుకోవడం లాంటివి చేయాలి. ఇలా చేయడం వల్ల టాబ్లెట్స్ వినియోగం తగ్గి శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.




Tags:    

Similar News