తిరుపతి ఉప ఎన్నికల్లో భారీగా దొంగ ఓటర్లు పట్టబుడ్డారు. బీజేపీ, టీడీపీ నేతలు ప్రతీ పోలింగ్ బూతుకు తిరుగుతూ దొంగ ఓటర్లను ఏరివేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తిరుపతిలో పెద్ద ఎత్తున నకిలీ ఓటర్లు ఇతర ప్రాంతాల నుంచి వచ్చారని ఇప్పటికే టీడీపీ, బీజేపీలు ఆరోపిస్తున్నాయి. పలు చోట్ల వాహనాల్లో వస్తున్న వారిని అడ్డుకొని వెనక్కి పంపించారు.
తిరుపతిలో ఓటేసేందుకు వచ్చిన పక్క జిల్లాల ఓటర్లను పలువురిని బీజేపీ, టీడీపీ నేతలు ఎక్కడికక్కడ పట్టుకుంటున్నారు.తిరుపతిలో నకిలీ ఓటర్లపై ఇప్పటికే బీజేపీ అభ్యర్థి రత్నప్రభ స్వయంగా చెక్ చేసి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీ సైతం ఫిర్యాదు చేశారు.
తాజాగా ఓ బీజేపీ మహిళ నేత పోలింగ్ బూతును సందర్శించింది. అక్కడ క్యూలో నిలబడ్డ ఓటరు స్లిప్ తీసుకొని తన ఇంటిపేరు, తండ్రి పేరు సహా అడ్రస్ ను అడిగింది. దానికి ఆ ఓటరు తడబడడం.. తెలియదని అనడంతో దొంగ ఓటుగా నిర్ధారించి సీరియస్ అయ్యి పోలీసులను పిలిపించి పంపించివేసింది. ఆ క్యూలైన్లో దాదాపు 10 మంది వరకు దొంగ ఓటర్లు నేతలకు చిక్కడం విశేషం.దీన్ని తిరుపతిలో భారీగా దొంగ ఓట్లు వేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చారని.. వారు ఎవరు? ఎందుకు వచ్చారనే దానిపై అధికారులు ఆరాతీస్తున్నారు.
Full View