అప్పుడప్పుడు ఈ ప్రపంచంలో కొన్ని వింత ఘటనలు చోటు చేసుకుంటాయి. ఇంతకీ ఆ వింత ఏమిటి అంటే . ఓ సాధారణ రైతు తన గేదె పాలు ఇవ్వడం లేదని స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశాడు. ఈ ఘటన స్థానికంగా బాగా వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్ లోని భిండ్ జిల్లా లో నివసిస్తున్నాడు బాబులాల్ జాదవ్. గేదెలు ఇచ్చే పాలే అతని జీవనాధారం. వాటిని అమ్ముకుని వచ్చే డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటాడు. ఓరోజు అతను హఠాత్తుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. తన గేదె పాలు ఇవ్వడం లేదని కంప్లయింట్ ఇచ్చాడు. పోలీసులు నవ్వుకుని, అతడిని అక్కడ్నించి పంపించేశారు. కానీ జాదవ్ వదల్లేదు.
ఇంటికెళ్లి తన గేదెతో సహా తిరిగి పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. అతడిని చూసి పోలీసులు తలలు పట్టుకున్నారు. గేదె పాలు ఇవ్వకపోతే మమ్మల్నేం చేయమంటావ్ అంటూ అతనికి సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ జాదవ్ మాత్రం అక్కడ్నించి వెళ్లేందుకు ఒప్పుకోలేదు. కేసు నమోదు చేసుకోమని పట్టుపట్టాడు. తన గేదె రోజూ ఉదయం, సాయంత్రం పాలు ఇచ్చేదని, కొన్ని రోజులుగా ఇవ్వడం లేదని చెప్పాడు జాదవ్. గ్రామంలో ఎవరో చేతబడి చేయడం వల్లే ఇలా జరిగిందని. గేదెకు మీ సాయం అవసరమని పోలీసులకు చెప్పాడు. గ్రామస్థులే తనకు పోలీస్ స్టేషన్ కు వెళితే న్యాయం జరుగుతుందని చెప్పారని తెలిపాడు.
ఆ తర్వాత ఈ విషయం డీఎస్పీ అరవింద్ షా వరకు చేరింది. ప్రత్యేకమైన కేసుగా దీన్ని పరిగణించిన డీఎస్పీ, పశువైద్యుల సహకారం తీసుకున్నారు. అతడు పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా ఆసుపత్రికి చేరుకున్నాడు. రెండు రోజుల తరువాత తిరిగి స్టేషన్ వచ్చాడు జాదవ్. ఈసారి కంప్లయింట్ ఇచ్చేందుకు కాదు, థ్యాంక్స్ చెప్పేందుకు. ఆసుపత్రిలో చూపించాక గేదె పాలు ఇవ్వడం మొదలుపెట్టిందట. ఆ విషయం పోలీసులకు చెప్పి ఆనందంగా ఇంటికి వెళ్లిపోయాడు జాదవ్.