సెక్స్ చేసినందుకా? బ‌య‌ట‌కు చెప్పినందుకా?

Update: 2015-11-03 11:52 GMT
అర్సిఖాన్ పేరు గుర్తుందా?క‌చ్ఛితంగా లేద‌నే చెబుతారు. అదే.. ఆ మ‌ద్య‌న అమ్ముడు చెప్పిన మాట‌ల్ని గుర్తు చేస్తే ఒక్క‌సారి ఆమె గుర్తుకు రాక మాన‌దు. తాను పాక్ క్రికెట‌ర్ షాహిద్ అఫ్రిదీతో సెక్స్ చేశాన‌ని చెప్పిన అమ్మ‌డు.. నేను ఎవ‌రితోనైనా ప‌డుకునే ముందు ఇండియ‌న్ మీడియా ప‌ర్మిష‌న్ తీసుకోవాలా? అంటూ బోల్డ్ గా మాట్లాడేసి పెద్ద వివాదాన్నే సృష్టించిన సంగ‌తి గుర్తుందా? అవునని.. చ‌ప్పున గుర్తుకు వ‌చ్చేయ‌టం ఖాయం. ఇప్పుడా అమ్మ‌డు మ‌ళ్లీ మ‌రోమారు మీడియాలోకి వ‌చ్చేసింది.

అప్ప‌ట్లో అఫ్రిదీతో ప‌డుకున్న విష‌యాన్ని చెప్పిన ఆమె.. అదంతా త‌న వ్య‌క్తిగ‌త‌మ‌ని.. త‌న దృష్టిలో అది ప్రేమ‌ని చెప్పుకున్న ఆమెపై తాజాగా ఫ‌త్వా జారీ అయ్యింది. పాక్ కు చెందిన ఇస్లాం మ‌త పెద్ద‌లు ఆమెపై ఫ‌త్వా జారీ చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇస్లాంను.. పాకిస్థాన్ కు చెడ్డ‌పేరు తీసుకొచ్చేలా ఆమె మాట‌లు ఉన్నాయంటూ ఆమెపై ఫ‌త్వా జారీ చేశారు.

దీంతో.. మోడ‌ల్ క‌మ్ చిన్న చిత్రాల న‌టి అయిన అర్సిఖాన్ విప‌రీతంగా బాధ‌ప‌డిపోతున్నారు. అమ్మ‌డు బాధ ఫ‌త్వా జారీ అయ్యింద‌నే క‌న్నా.. త‌న‌కు అనుకూలంగా ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా మాట్లాడ‌రేం అంటూ ట్వీట్స్ చేసేస్తోంది. త‌న‌పై ఫ‌త్వా జారీ చేసిన దానికి వ్య‌తిరేకంగా ఒక్క‌రు కూడా మాట్లాడ‌రా అన్న‌ది ఆమె ఆవేద‌న‌గా మారింది.

ఫ‌త్వా మీద త‌న అసంతృప్తిని వ్య‌క్తం చేస్తూనే.. తానేమీ బాధ‌ప‌డ‌న‌ని.. భ‌య‌ప‌డ‌న‌ని చెబుతూ..త‌న ట్వీట్ కు ఒక వీడియోను జ‌త చేసింది. అందులో.. న‌న్ను చంపుతారా? లేక నా మీద ఇంకు జ‌ల్లుతారా? మోస్ట్ వెల్ కం. శివ‌సేన‌.. ముల్లాల‌కు ఇదే నా ఆహ్వానం ట్వీట్ చేసేసింది. ఇంత ఓపెన్ గా చెప్పేసిన ఆమె కార‌ణంగా ఇంకెన్ని ర‌చ్చ‌లు జ‌రుగుతాయో?
Tags:    

Similar News