తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలితతో మూడుదశాబ్దాలపాటు అత్యంత సన్నిహితంగా మెలిగిన తాను అమ్మ లేకపోవడంతో తాను ఒంటరిననే భావనకు గురవుతున్నానని ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళ తెలిపారు. అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శిక్షను అనుభవిస్తున్న శశికళ ఈ మేరకు పార్టీ కార్యకర్తలకు ఒక లేఖ పంపించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జయలలిత ఎన్నో వ్యయప్రయాసలకు లోనై అన్నాడీఎంకేను బతికించిందని శశికళ చెప్పుకొచ్చారు. ఎంజీఆర్ చనిపోయిన తర్వాత పార్టీని కాపాడిన ఒకేఒక్క ధీర వనిత జయలలిత అని శశికళ ఆ లేఖలో పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత కీర్తి ప్రతిష్ఠలు మరింత పెంపొందేలా ఆమె జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.
తాను ప్రతి సంవత్సరం జయలలిత వెంటే ఉండి ఎంతో ఆరాధనతో అమ్మ జన్మదిన వేడుకలు నిర్వహించానని, కానీ, ఈ ఏడాది ఆమె లేకుండా వేడుకలు జరుపాల్సి వస్తుందని తాను ఏనాడూ ఊహించలేదని లేఖలో శశికళ తెలిపారు. 'అమ్మ మన వెంట లేకపోవడం చాలా బాధకు గురిచేస్తోంది. గత 33 ఏళ్లుగా ఆమె వెంట ఉండే జన్మదిన వేడుకలు నిర్వహించాను. ఆమె జ్ఞాపకాలతో ఈ ఏడాది ఒంటరిననే భావన కలుగుతోంది. నా ఆలోచనలు ఆమె చుట్టే తిరుగుతున్నాయి' అని పేర్కొన్నారు. శుక్రవారం జయలలిత 69వ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పేదలకు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు ఆమె పిలుపునిచ్చారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/