ప్రపంచవ్యాప్తంగా మతోన్మాదం రెక్కలు విప్పి తన మూర్ఖపు బుద్ధిని ప్రదర్శించుకుంటున్న పరిస్థితుల్లో విద్యావంతులు సంయమనం పాటించాల్సి ఉంటుంది. తాము సన్మార్గంలో నడవటమే కాకుండా...పదుగురిని ఆ దారి వెంట తీసుకువెళ్లాలి. అయితే అవన్నీ వదిలేసి నిస్సిగ్గుగా మత పిచ్చితో కామెంట్లు చేసిన ఓ ప్రొఫెసర్ నిర్వాకం ఇది. అత్యాచారాలు అంటేనే అసహ్యించుకునే పరిస్థితి ఉంటే...దానికి మహిళ అయిన ప్రొఫెసర్ మద్దతివ్వడం ఆశ్చర్యకరం.
ఈజిప్ట్ రాజధాని కైరోకు చెందిన అల్-అజర్ యూనివర్శిటీకి చెందిన మహిళా ఇస్లామిక్ ప్రొఫెసర్ సువాద్ సలే ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ వ్యాఖ్యలు చేశారు. 'ఇన్ క్విస్టిర్' వార్తా సంస్థకు ఇచ్చిన ఈ ఇంటర్వ్యూ ఇప్పుడే 'లైవ్ లీక్'లో పోస్ట్ కాగా, వైరల్ అవుతోంది. ముస్లిం పురుషులు ఇతర మతానికి చెందిన మహిళలను లైంగిక బానిసలుగా చూసుకోవచ్చని, అది అల్లా దృష్టిలో చట్ట సమ్మతమేనని ఈ ప్రొఫెసర్ గారు సెలవిచ్చారు. అయితే, అది ఒకసారికి మాత్రమే పరిమితమని చెప్తూనే...ఇజ్రాయిల్ వంటి శత్రువులపై చేసే యుద్ధంలో భాగంగా వారి మహిళలను ఏమైనా చేయవచ్చని అన్నారు
కాగా, ఆ ప్రొఫెసర్ వ్యాఖ్యల ప్రకారం, ఈజిప్ట్ ముస్లింలు ఇజ్రాయిల్ మహి ళలను లైంగిక బానిసలుగా వాడుకోవచ్చని, అత్యాచారాలు చేయవచ్చని ఇన్ క్విస్టర్ న్యూస్ రిపోర్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఆమె మాట్లాడిన వీడియో ఇప్పుడు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంది. ఆమె వ్యాఖ్యలపై ఇప్పుడు దుమారం చెలరేగుతుండగా, దీనిని పలువురు ముస్లిం జాతీయులు కూడా ఖండిస్తున్నారు. ఇస్లాంపై ఇది తప్పుడు ప్రచారమని దుయ్యబ డుతున్నారు.