ఫలానా రంగంలో తెలంగాణ రాష్ట్రం మిగిలిన రాష్ట్రాలకు స్ఫూర్తివంతం.. ఫలానా అంశంలో దూసుకెళుతోంది. ఇలా తరచూ కేంద్రం తమకు కితాబులు ఇచ్చిన ప్రతిసారీ.. ఆ విషయాల్నితెలంగాణ ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకోవటం తెలిసిందే. ఇలా తరచూ తమను కేంద్రం తమను పొగిడేస్తుందని.. రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు మాత్రం తమను తిట్టి పోస్తుంటారంటూ టీఆర్ఎస్ అధినేతలు విరుచుకుపడుతుంటారు. ఇదిలా ఉంటే.. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022 ఆర్థిక సర్వేను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె వెల్లడించిన విషయాల్ని చూసినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఈ మధ్యన పాలన కుంటుపడటంతో పాటు.. ఆర్థికంగా వెనుకబాటుకు గురవుతుందన్నవిషయాన్ని చెప్పేసిన వైనం షాకింగ్ గా మారింది.
తెలంగాణలో గృహ నిర్మాణ రంగం వేగంగా పరుగులు తీస్తుందని కితాబులు ఇస్తూనే.. అదే సమయంలో మరికొన్ని రంగాల్లో వెనుకబాటు పడుతున్న వైనాన్ని వెల్లడించింది. పొగడ్తల్ని సానుకూలంగా తీసుకునే కేసీఆర్ సర్కారు.. ఆర్థిక రగంలో తెలంగాణ పరిస్థితి ఎలా ఉందన్న విషయాన్ని వెల్లడించటంపై రాజకీయ దుమారం లేవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.
కేసీఆర్ సర్కారు పాలనలోని లోపాల్ని ఎత్తి చూపేలా.. కొన్ని అంశాల్ని ప్రస్తావించారు. అందులో ముఖ్యమైనది తెలంగాణ సేవా రంగం గడిచిన మూడేళ్లుగా తగ్గుతున్న వైనాన్ని వెల్లడించింది. 2018-19లో 7.91 శాతం మేర ఉన్న ఈ రంగం 2019-20 నాటికి 5.69 శాతం.. తాజాగా అది కాస్తా మైనస్ 3.94 శాతానికి పడినట్లుగా పేర్కొన్నారు.
మెరుగైన పారిశుద్ధ్య వసతులతో కూడిన ఇళ్లలో జీవించే వారి సంఖ్య 2015-16 నాటి కుటుంబ సర్వేలో తెలంగాణ 76.2 శాతంగా ఉంటే.. తాజాగా అది కాస్తా 52.3 శాతానికి పడిపోయినట్లుగా సర్వే నివేదిక వెల్లడించింది. అంతేకాదు.. శిశు మరణాల రేటు ఆరోగ్య సర్వే 4 ప్రకారం చూస్తే.. తెలంగాణ రేటు 27.7 శాతం ఉంటే.. సర్వే 5లో అది కాస్తా26.4 శాతానికి తగ్గింది. నీతిఆయోగ్ విడుదల చేసిన సుస్థిర అభివ్రద్ధి లక్ష్యాల సూచిలో తెలంగాణ 11వ స్థానంలో నిలిచింది.
నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద తెలంగాణకు నిధులు తగ్గాయి. 2019-20లో రూ.11 కోట్లు విడుదల కాగా.. 2020-21లో అది కాస్తా రూ.3కోట్లకు తగ్గినట్లుగా వెల్లడైంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పగా చెప్పుకునే తెలంగాణ రాష్ట్ర నికర ఉత్పత్తి వ్రద్ధిరేటు 2020-21లో 2.5 శాతానికి పడిపోయినట్లుగా పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన ఏడాది 11.8 శాతంగా ఉంటే.. తాజాగా రూ.2.5 శాతం ఉండటం గమనార్హం. తలసరి వ్రద్ధి రేటు 1.8 శాతమే నమోదైంది.
పలు అంశాల్లో తెలంగాణ వెనుకబాటలో ఉన్నట్లుగా పేర్కొన్న ఆర్థిక సర్వే నివేదిక కొన్నిసానుకూల అంశాల్ని వెల్లడించటం విశేషం.
- దేశంలో వామపక్ష తీవ్రవాద ప్రభావానికి గురైన 9 రాష్ట్రాల్లోని 44 జిల్లాల్లో రోడ్డు అనుసంధానత మెరుగుపడిన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి.
- రాష్ట్రంలో సంతాన సాఫల్యరేటులో మార్పు లేదు.
- రాష్ట్రంలో శిశు మరనాల రేటు ఆరోగ్య సర్వే 4లో 27.7 శాతం ఉంటే.. ఇప్పుడు అది 26.4కు తగ్గింది.
- గ్రామీణ ప్రాంతాల్లో 100 శాతం కుటుంబాలకు తాగునీరు సౌకర్యం కల్పించిన ఆరు రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాల్లో తెలంగాణ ఒకటి కావటం గమనార్హం.
- హైదరాబాద్ లో అటవీ విస్తరణ 2011లో పోలిస్తే 2021లో146.8శాతం పెరిగినట్లుగా పేర్కొన్నారు. అహ్మదాబాద్.. బెంగళూరు.. చెన్నై.. ధిల్లీ.. కోల్ కతా.. ముంబయితో పోలిస్తే హైదరాబాద్ లో పెరుగుదల ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.