పోలీసులు ఇక మ‌న‌ల్ని తిప్ప‌లు పెట్ట‌లేరు

Update: 2017-02-12 08:01 GMT
పోలీసులు ఇక నుంచి త‌మ‌దైన శైలిలో మ‌న‌ల్ని ఇబ్బంది పెట్ట‌లేదు. ఏదైనా ఒక ఘటనకు సంబంధించి మీరు సమీప పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరిస్తే శిక్షార్హమైన నేరం కానుంది. ఈ మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదుకు నిరాకరించే అధికారులపై చర్యలు తీసుకోవాలని పార్లమెంటరీ కమిటీ ప్రభుత్వానికి గట్టిగా సూచించింది. కేంద్ర మాజీ హోం మంత్రి చిదంబరం నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇటీవల తన నివేదికను ప్రభుత్వానికి అందించింది. పోలీస్‌స్టేషన్లలో ఎటువంటి పక్షపాతం చూపించకుండా ఫిర్యాదులను స్వీకరించి వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తే సామాన్యుడికి సైతం న్యాయం దక్కుతుందని చెప్పింది.

ఆయా సంఘట‌న‌లో త‌ప్ప‌నిస‌రిగా ఎఫ్‌ఐఆర్‌ను సీసీటీఎన్‌ఎస్ (క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టం) సాఫ్ట్‌వేర్ ద్వారా నమోదు చేయడం, దాని ఆధారంగా దర్యాప్తు చేయాల్సి వస్తుండటంతో అధికారులు వెనుకడుగు వేస్తున్నారని అభిప్రాయపడింది. ఎఫ్‌ఐఆర్‌లను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం, దర్యాప్తులో పారదర్శకత పెంచడం కోసం కేంద్రం ప్రభుత్వం ఇటీవల సీసీటీఎన్‌ఎస్ వ్యవస్థను ప్రారంభించింది. ఇందులో భాగంగా దేశంలో ఎక్కడి నుంచైనా ఫిర్యాదు నమోదు చేయవచ్చు. దర్యాప్తు పురోగతిని ఉన్నతాధికారులు పర్యవేక్షించవచ్చు. దేశవ్యాప్తంగా దాదా పు 14,999 పోలీస్ స్టేషన్లు ఉండగా, బీహార్, రాజస్థాన్‌లోని 1,757 పోలీస్ స్టేషన్లలో ఈ వ్యవస్థను ప్రారంభించడంలో ఆలస్యం అవుతున్నదని కేంద్రం పేర్కొంది. మిగతా 13,242 పోలీస్‌స్టేషన్లలో ఆన్‌లైన్ వ్యవస్థ పనిచేస్తుండగా 12,519 స్టేషన్లలో (94.5%) వందశాతం ఎఫ్‌ఐఆర్‌లు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారని నివేదిక విడుదల చేసింది.
Tags:    

Similar News