తూటాల్లాంటి మాటలతో రెచ్చగొట్టటం.. ఇష్టారాజ్యంగా మాట్లాడటం తెలంగాణ మజ్లిస్ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీకి కొత్తేం కాదు. మత విద్వేషాల్ని రెచ్చగొట్టేలా గతంలో అదిలాబాద్ జిల్లా నిర్మల్ లో చేసిన ప్రసంగానికి కొంతకాలం జైల్లో ఉండి వచ్చిన ఆయన.. తాజాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయటానికి వెళ్లిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా ప్రధాని మోడీని ఉద్దేశించి చేసిన ప్రసంగం అక్కడ కలకలం రేగింది. విద్వేషాన్ని వెళ్లగక్కి.. అభ్యంతరకర రీతిలో ప్రసంగించిన అక్బరుదీన్ వైఖరిని తప్పు పడుతూ.. పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదును తీసుకున్న పోలీసులు.. విచారించి కేసు బుక్ చేశారు.
ప్రధాని మోడీపై అక్బరుద్దీన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నమోదైన కేసులో.. ఆయన అరెస్ట్ కు బుధవారం ఆదేశాలు జారీ చేశారు. మరి.. బీహార్ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న అక్బరుద్దీన్ ను అక్కడి పోలీసులు అరెస్ట్ చేస్తారా? ఒకవేళ చేస్తే.. తదనంతర పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు ఉత్కంట గా మారింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అక్బరుద్దీన్ ను పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.