ట్విట్ట‌ర్ కు గుడ్‌ బై చెప్పిన ఫైర్‌ బ్రాండ్‌

Update: 2019-11-13 06:53 GMT
పెరిగిన సాంకేతిక‌త‌ కొంద‌రికి సౌక‌ర్యం అయితే చాలా మందికి సంక‌టంగా మారింది. సోష‌ల్ మీడియా కార‌ణం గా ప్ర‌పంచం మొత్తం కుగ్రామం గా మారింది. ఎక్క‌డ ఏది జ‌రిగినా క్ష‌ణాల్లో తెలిసి పోతూ వైర‌ల్ గా మారుతోంది. కొన్ని సంద‌ర్భాల్లో మంచి చేస్తున్నా దీని కార‌ణంగా చెడే ఎక్కువగా జ‌రుగుతోంద‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. అయినా స‌రే సోష‌ల్ మీడియా ను క‌ట్ట‌డి చేయడానికి మాత్రం ప్ర‌య‌త్నాలు జ‌ర‌గ‌డం లేదు. ఒక వేళ చేయాల‌నుకున్నా ఆ ప్ర‌య‌త్నాల‌న్నీ న‌త్త‌న‌డ‌క‌న న‌డుస్తున్నాయి.

సోష‌ల్ మీడియా కార‌ణంగా సెల‌బ్రిటీలు అభిమానుల‌కు ద‌గ్గ‌రైనా దీని వ‌ల్ల చాలా సంద‌ర్భాల్లో అవ‌మానాల‌కు గుర‌య్యారు. నిరంత‌రం ట్రోల్ క‌ల్చ‌ర్ తో ఆవేద‌న‌ కు గుర‌వుతూనే వున్నారు. కొంత మంది మ‌రీ హ‌ద్దులు దాటి సెల‌బ్రిటీల‌ ని ట్రోల్ చేయ‌డం ఈ మ‌ధ్య కాలం లో మ‌రీ నిత్య కృత్యం గా మారింది. తాజాగా సోష‌ల్ మీడియా దెబ్బ‌ కు సీనియ‌ర్ న‌టి.. ఫైర్ బ్రాండ్ ఖుష్బూ ట్విట్ట‌ర్ నుంచి నిష్క్ర‌మించాల్సి వ‌చ్చింది. ఖుష్బూ గ‌త కొంత కాలం గా ట్విట్ట‌ర్ లో ఎంతో యాక్టీవ్ గా వుంటున్నారు. అయితే ఆమెని ట్రోల్ చేసే వ‌ర్గం అతి మ‌రీ ఎక్కువైంది. కులం పేరుతో కొంత మంది ట్రోల్ చేస్తుండ‌డం తో ఆమె త‌న ట్విట్ట‌ర్ ఖాతా ప్రొఫైల్ కు పూర్తి పేరు ని జ‌త‌చేసి కంట్రోల్ చేయాల‌నుకున్నారు. కానీ అది సాధ్య‌ ప‌డ‌లేదు.

ఆ త‌ర‌వాత కూడా బూతు తిట్ల క‌ల్చ‌ర్ శృతి మించ‌డంతో మ‌న‌ స్థాపానికి గురైన స‌ద‌రు సీనియ‌ర్ న‌టి తాజాగా ట్విట్ట‌ర్ కు గుడ్ బై చెప్పేశారు. కాంగ్రెస్ పార్టీ వ్య‌వ‌హారాల్లో చురుగ్గా పాల్గొంటూ ఆ విషయాల్ని సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా పంచుకునే ఖుష్బూ ను గ‌త కొంత కాలం గా ఓ వ‌ర్గం వారు టార్గెట్ చేస్తూ ట్వీట్ లు చేయ‌డం హీటెక్కించింది. మొద‌ట్లో ప‌ట్టించు కోని ఆమె ఆ త‌రవాత త‌రవాత వారి ట్వీట్ లు మ‌రీ శృతి మించ‌డంతో ట్విట్ట‌ర్ నుంచి నిష్క్ర‌మించ‌డం ప్ర‌స్తుతం సినీరాజ‌కీయ వ‌ర్గాల్లో అభిమానుల్లో చ‌ర్చ‌నీయాంశం గా మారింది. ఇలా ఆమె ట్విట్ట‌ర్‌ కు ఎంత కాలం దూరం గా వుంటారో చూడాల‌ని ఆమె స‌న్నిహితులు చెబుతున్నారు. ఇక సినిమాల ఫ్యాన్స్ ఇలా చేయ‌రు.. రొద పెట్టే రాజ‌కీయాల వ‌ల్ల‌నే ఈ ట్రోలింగ్ టూమ‌చ్ అవుతోంద‌ని కూడా విశ్లేషిస్తున్నారు.
Tags:    

Similar News