తమిళనాడు రాజకీయాల్లో.. అందునా అమ్మ అధినేత్రిగా వ్యవహరించిన అన్నాడీఎంకే పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్న రోజునే చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అమ్మకు అత్యంత ఇష్టమైన గెస్ట్ హౌస్ ఈ రోజు అగ్నిప్రమాదానికి గురైంది. శశికళ.. ఆమె మేనల్లుడు దినకరన్ ను పార్టీ నుంచి బయటకు పంపుతున్న వేళలోనే.. అమ్మకు ఇష్టమైన గెస్ట్ హౌస్ లో అగ్నిప్రమాదానికి గురి కావటం గమనార్హం. చెన్నై నగరానికి 70 నుంచి 80 కిలోమీటర్ల మధ్యన ఉండే ఈ బంగ్లాకు విడిది కోసం జయలలిత అప్పుడప్పుడు మాత్రమే వెళ్లే వారు.
ప్రస్తుతం ఈ బంగ్లాను శశికళ.. దినకరన్ కుటుంబీకుల అధీనంలోనే ఉంది. వారి కుటుంబ సభ్యులే బంగ్లాలో ఉంటున్నారు. చిన్నమ్మ జైలుకు వెళ్లిన తర్వాత నుంచి దినకరన్ అధీనంలోనే ఈ బంగ్లా ఉంది. పార్టీ నుంచి దినకరన్ ను బహిష్కరించిన సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవటం ఏమిటన్నది పలువురికి సందేహంగా మారింది.
జయలలితకు ఉన్న మొత్తం ఆస్తుల్లో పోయెస్ గార్డెన్ తర్వాత అత్యంత ఖరీదైన బంగ్లా సిరుతాపూర్ బంగ్లా ఒకటిగా చెబుతుంటారు. అలాంటి బంగ్లాలో అగ్నిప్రమాదం చోటు చేసుకోవటం విశేషం. బంగ్లాలో చోటు చేసుకున్న మంటల్ని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అమ్మ ఆస్తుల లెక్క బయటకు రాకుండా ఉండటానికే ఈ అగ్నిప్రమాదాన్ని సృష్టించారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఉదంతానికి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/