తొలి కరోనా కేసు నమోదు.. కిమ్ ఏం చేస్తున్నారు?

Update: 2022-05-12 06:27 GMT
ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టించినా... ఉత్తర కొరియా మాత్రం 2020 నుంచి తమ దేశంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని తెలిపింది. తాజాగా తమ దేశంలో తొలి కరోనా కేసు వెలుగు చూసినట్లు నార్త్ కొరియా వెల్లడించింది. దీంతో ఆ దేశ అధ్యక్షుడు కిమ్ దేశంలో తీవ్రమైన జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారట.  దేశంలో కరోనా మూలాలు అంతం చేయాలని కిమ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.

దేశ రాజధాని  ప్యోంగ్యాంగ్ లో జ్వర పీడితుల నమూనాలను పరిశీలించగా... అందులో ఒకరికి  ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ నిన్న వెల్లడించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన దేశాధినేత కిమ్... అధికార కొరియన్ వర్కర్స్ పార్టీ పొలిట్ బ్యూరో సమావేశాన్ని ఏర్పాటు చేసే కేసుపై చర్చించారు.

వైరస్ ను అదుపు చేసే చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు. వీలైనంత తక్కువ సమయంలోనే కరోనా నమూనాలను అంతమొందించడం లక్ష్యమని వివరించారు.

కాగా.. జనవరి 3వ తేదీ 2020 నుండి ఈ ఏడాది మే 11 వరకు ఉత్తర కొరియాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. గతంలో పొరుగునే ఉన్న దక్షిణ కొరియా, చైనాలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు విస్తృతంగా వెలుగులోకి వచ్చాయి. కోవాక్స్ గ్లోబల్ కొవిడ్-19 వ్యాక్సిన్ షేరింగ్ ప్రోగ్రామ్, చైనా నుంచి సినోవాక్ బయోటెక్ వ్యాక్సిన్ల ఎగుమతులను ఉత్తర కొరియా తిరస్కరించింది.

కరోనా వైరస్ వ్యాప్తిని స్థిరంగా నియంత్రించడం, కరోనా సోకిన వ్యక్తులకు త్వరగా నయం అయ్యేలా చూడటం, అతి తక్కువ సమయంలో కరోనా వ్యాప్తి చెందే మూలాలను తొలగించడానికి అవసరమైన క్వారంటైన్ వ్యవస్థను తీసుకురావడానికి ఈ తాజా సమావేశాన్ని నిర్వహించామని వర్కర్స్ పార్టీ సమావేశంలో కిమ్ చెప్పారు. ఫ్యోంగ్యాంగ్ లో కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు దక్షిణ కొరియాకు చెందిన ఒక వెబ్ సైట్... జాతీయ సమస్య కారణంగా ఇంటికి తిరిగి రావాలని.. అందరూ ఇళ్లలోనే ఉండాలని చెప్పినట్లు తెలిపింది.

కొవిడ్-19 విషయం ప్రస్తావించకుండా చాలా మందికి అనుమానిత ఫ్లూ లక్షణాలు ఉన్నాయని.. కావున  మే 11 నుండి ఉత్తర కొరియా తన ప్రజలను ఇంట్లోనే ఉండాలని కోరినట్లు చైనా ప్రభుత్వం టెలివిజన్ గురువారం తెలిపింది. మరి కిమ్ మామ తీసుకునే నిర్ణయాలు, కట్టడితో... కరోనా మహమ్మారిని అంతం చేస్తారో లేదా చూడాలి. ఆయన నిర్ణయాలు, వ్యూహాలు ఆ దేశ ప్రజలను కరోనా నుంచి కాపాడుతాయో లేదో చూడాలంటే ఇంకా కొంత కాలం వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News