మాటలు తూటాల్లా పేల్చుకున్న బీహార్ ఎన్నికల తొలిదశ పోలింగ్ పూర్తయింది. మొత్తం ఐదుదశల్లో జరగనున్న పోలింగ్ లో భాగంగా తొలి విడత పోలింగ్ సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఎన్నికల వేళ.. మహాకూటమికి.. ఎన్డీయే పక్షానికి మధ్య పచ్చగడ్డి వేస్తే మండిపోయేలా మాటల తూటాలు విసురుకున్నారు. కులాల వారీగా చీలిపోయిన భీహార్ ఎన్నికల ప్రచారం జరిగిన తీరు చూస్తే.. భారీగా పోలింగ్ జరుగుతుందన్న భావన వ్యక్తమైంది.
అయితే.. సోమవారం ముగిసిన పోలింగ్ చూస్తే మాత్రం నీరసం కలగక మానదు. తొలి దశ పోలింగ్ 49 నియోజకవర్గాల్లో మాత్రమే జరిగింది. పది జిల్లాల పరిధిలో జరిగిన పోలింగ్ కేవలం 52.12 శాతం మాత్రమే నమోదు కావటం గమనార్హం. ఆ మధ్య జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా భారీగా పోలింగ్ నమోదు అయితే.. బీహార్ తొలి దశ పోలింగ్ మాత్రం నీరసంగా సాగిందనే చెప్పాలి. మరి.. మిగిలిన దశల పోలింగ్ అయినా బారీగా పోలింగ్ నమోదు అవుతుందో లేదో చూడాలి.