కరోనాకు తొలిసారి భయపడ్డ ట్రంప్.. ఏం చేశాడంటే?

Update: 2020-07-12 05:15 GMT
కరోనా ఎంత భయపెట్టినా.. అమెరికాను అల్లకల్లోలం చేసినా.. ఇప్పటికీ మూడు నెలలు అయినా దాదాపు 70 ఏళ్లకు పైబడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదరలేదు.. బెదరలేదు. మాస్క్ అస్సలు పెట్టుకోను అంటూ విలేకరుల సమావేశంలోనే తొడగొట్టేవాడు.. చైనీస్ వైరస్ అంటూ తిట్టిపోసేవాడు.కానీ మొదటిసారి ట్రంప్ బెండ్ అయిపోయాడు.

తాజాగా వాషింగ్టన్ సమీపంలోని వాల్డర్ రీడ్ మిటరీ మెడికల్ సంటర్ ను సందర్శించడానికి   అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెళ్లారు. గతానికి భిన్నంగా ముఖానికి మాస్క్ తో కనిపించడం విశేషంగా మారింది. అమెరికాలో కరోనా ఎంత వ్యాపించినా తానుమాత్రం మాస్క్ ధరించడానికి పెద్దగా ఇష్టపడనను అన్న ట్రంప్  అమెరికాలో మరోసారి విజృంభిస్తున్న కరోనా మహమ్మారికి తాజాగా మాస్క్ తో తొలిసారి కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ప్రస్తుతం తాను సందర్శించబోతున్నది ఓ మెడికల్ సెంటర్ కావడం వల్ల మాస్క్ ధరించానని ట్రంప్ చెప్పుకొచ్చాడు. తాను మాస్క్ ధరించడానికి వ్యతిరేకం కాదని తాజా విలేకరుల సమావేశంలో తెలిపాడు.

కాగా అమెరికాలో కరోనాకు దూసుకుపోతోంది. ఒక్కరోజే 66528 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 33 లక్షలకు చేరింది. ఇప్పటికే అమెరికాలో కరోనాతో 137403మంది మరణించారు. దీంతో కరోనా తీవ్రతకు ట్రంప్ భయపడి మాస్క్ ధరించడం హాట్ టాపిక్ గా మారింది.
Tags:    

Similar News