టీవీ చూడటం మీకిష్టమా?ఈ రికార్డ్ బ్రేక్ చేయగలరా?

Update: 2016-03-21 22:30 GMT
ఇవాల్టి రోజున టీవీ చూడటం ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి? కానీ.. అలా టీవీ చూసే విషయంలోనూ ప్రపంచ రికార్డును మీ పేరున నమోదు చేసుకునే అద్భుత అవకాశం ఉంది. అదెలా అంటారా? నాన్ స్టాప్ గా ఒక 95 గంటలు చూడగలిగితే చాలు.. అరుదైన రికార్డు మీ సొంతమైనట్లే. తాజాగా ఇలాంటి ఫీట్ చేసిన ఒక యువ బృందం కొత్త రికార్డును తమ పేరు మీద రాయించుకున్నారు.

అదెలానంటే.. ఆస్ట్రియా రాజధాని వియన్నాకు చెందిన నలుగురు యువకులు.. ఒక యువతి అత్యధిక సమయం టీవీ చూస్తూ రికార్డు బ్రేక్ చేయాలని భావించారు. ఇందుకు తగ్గట్లు కొన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. గిన్నిస్ బుక్ లో ఎక్కేందుకు వారు.. నాన్ స్టాప్ గా 92 గంటల పాటు టీవీ చూస్తూ ఉన్నారు. ప్రతి గంటకు 5 నిమిషాల సేపు బ్రేక్ ఇస్తారు. ఈ సమయంలో వారు భోజనం నుంచి.. మిగిలిన పనులన్నీ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇలాంటి నిబంధనల్ని పాటించిన ఈ బృందం అత్యధికసేపు టీవీ చూస్తూ ప్రపంచ రికార్డును తమ పేరిట రాయించుకున్నారు. మరి.. 92 గంటల కంటే ఎక్కువ సమయం కానీ టీవీ చూస్తూ ఉండగలిగితే ఈ రికార్డు మీ సొంతం కావటం ఖాయం. ఆసక్తి ఉంటే.. ఇప్పటి నుంచే ట్రై చేయండి మరి.
Tags:    

Similar News