రెండు గంటల పని.. ఐదు రోజుల సెలవులు

Update: 2015-09-23 11:43 GMT
తెలంగాణ రాష్ట్ర వర్షాకాల సమావేశాలు బుధవారం మొదలు కావటం.. కచ్ఛితంగా రెండు గంటల పాటు జరిగిన సమావేశాలువాయిదా పడటం జరిగిపోయాయి. బుధవారం ఉదయం పది గంటల సమయంలో ప్రారంభమైన సమావేశాలు సరిగ్గా పన్నెండు గంటల ప్రాంతంలో వాయిదా పడ్డాయి. రెండంటే.. రెండు గంటల పాటు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు జరిగాయి.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తొలి రోజు సమావేశాలు రెండు గంటల పాటు జరిగిన అనంతరం.. ఈ నెల 29 వరకు సభన వాయిదా వేస్తూ తెలంగాణ స్పీకర్ వెల్లడించారు. అంటే.. తొలి రోజు రెండు గంటలు పని చేస్తే.. ఐదు రోజులు సెలవులన్న మాట. గురువారం మినహాయిస్తే శుక్రవారం బక్రీద్ పర్వదినం కావటం.. శనివారం వినాయక నిమిజ్జనం కావటంతో వరుస సెలవులు ఇచ్చినట్లుగా చెబుతున్నారు.

ఇక.. తొలిరోజు సమావేశాల్ని చూస్తే.. ఇటీవల కాలంలో మృతి చెందిన ప్రముఖులకు సంతాప తీర్మానాల్ని ప్రవేశ పెట్టి.. అన్నీ పార్టీల నాయకులు తమ సంతాపాన్ని తెలియజేశారు. మాజీ రాష్ట్రపతి.. ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్ కలాం మృతికి అన్నీ పార్టీలు సంతాపాన్ని తెలిపాయి. ఇక.. మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే కిష్ణారెడ్డి మృతికి సంతాపంగా అసెంబ్లీలో మరో తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా అన్నీ పార్టీ నేతలు కిష్ణారెడ్డి అకాల మరణానికి తమ ఆవేదనన పంచుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. కిష్ణారెడ్డితో తనకు 40ఏళ్ల అనుబంధం ఉందన్నారు.

మొదటిరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రముఖుల సంతాప తీర్మానాలకు మాత్రమే పరిమితం చేశారు. ఇక.. సంతాప తీర్మానాల సందర్భంగా పలు పార్టీల ప్రముఖులు నివాళులు అర్పించారు.
Tags:    

Similar News