జ‌గ‌న్ చెప్పిన ఐదుగురు డిఫ్యూటీ సీఎంలు వారేనా?

Update: 2019-06-07 07:49 GMT
ఏపీ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన నాటి నుంచి ఊహించ‌ని వేగంతో దూసుకెళుతున్న ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. తాజాగా త‌న మార్క్ నిర్ణ‌యంతో సంచ‌ల‌నంగా మారారు. దేశ రాజ‌కీయ చ‌రిత్ర‌లో మ‌రే ముఖ్య‌మంత్రి తీసుకోని రీతిలో కొత్త త‌ర‌హాలో ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

త‌న ప్ర‌భుత్వంలో ఐదుగురు డిప్యూటీ సీఎంల‌కు అవ‌కాశం ఇవ్వ‌నున్న‌ట్లుగా చెప్పిన ఆయ‌న‌.. వివిధ వ‌ర్గాల‌కు త‌మ ప్ర‌భుత్వంలో స‌మాన ప్రాధాన్య‌త ఉంటుంద‌న్న విష‌యాన్ని స్ప‌ష్టం చేయ‌టానికేన‌ని చెబుతున్నారు. మ‌రి.. జ‌గ‌న్ చెప్పినట్లుగా ఐదు డిప్యూటీ సీఎంలుగా ఎవ‌రిని ఎంపిక చేయ‌నున్నారు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం జ‌గ‌న్ ఎంపిక చేసే ఐదుగురు ఉప ముఖ్య‌మంత్రులు ఎవ‌రంటే.. కాపు సామాజిక వ‌ర్గం నుంచి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నానికి అవ‌కాశం ద‌క్క‌టం ఖాయ‌మంటున్నారు. అదే స‌మ‌యంలో మైనార్టీ కోటాలో క‌డ‌ప ఎమ్మెల్యే అంజాద్ బాషా.. ఎస్సీ కోటా కింద గుంటూరు జిల్లా ప్ర‌త్తిపాడు ఎమ్మెల్యే మేక‌తోటి సుచ‌రిత‌కు ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వులు ద‌క్కొచ్చ‌ని చెబుతున్నారు.

ఇక‌.. ఎస్టీ వ‌ర్గం నుంచి విజ‌య‌న‌గ‌రం జిల్లా సాలూరు ఎమ్మెల్యే రాజ‌న్న దొర‌కు.. బీసీ సామాజిక వ‌ర్గం నుంచి కృష్ణా జిల్లా పెన‌మ‌లూరు నుంచి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించిన పార్థ‌సార‌ధికి డిప్యూటీ సీఎంలుగా ప‌ద‌వులు ద‌క్కే అవ‌కాశం ఉందంటున్నారు.


Tags:    

Similar News