అర్థ‌రాత్రి కుప్పంలో ఆగ‌మాగం ఎందుకైంది?

Update: 2019-07-02 05:54 GMT
సోమ‌వారం అర్థ‌రాత్రి దాటిన త‌ర్వాత టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో ఊహించ‌ని ప‌రిణామం ఒక‌టి చోటు చేసుకుంది. ఎన్నిక‌ల్లో దారుణ ప‌రాజ‌యం త‌ర్వాత తన నియోజ‌క‌వ‌ర్గంలో రెండు రోజుల పాటు పర్య‌టించే ప్రోగ్రాం ఒక‌టి పెట్టుకున్నారు చంద్ర‌బాబు.

ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లికేందుకు వీలుగా అర్థ‌రాత్రి వేళ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే.. వీటిని కొంద‌రు ధ్వంసం చేయ‌టంతో ఒక్క‌సారిగా ఉద్రిక్త ప‌రిస్థితి నెల‌కొంది. బాబుకు స్వాగ‌తం ప‌లుకుతూ శాంతిపురం మండ‌ల కేంద్రంలో పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని.. తోర‌ణాల్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ధ్వంసం చేశారంటూ ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. దీంతో.. ఉద్రిక్త ప‌రిస్థితి చోటు చేసుకుంది.

సోమ‌వారం రాత్రి 11 గంట‌ల‌కు మొద‌లై ఈ ర‌చ్చ‌.. అర్థ‌రాత్రి వ‌ర‌కూ కొన‌సాగింది. టీడీపీ నేత‌ల ఆరోప‌ణ‌లు ఇలా ఉంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌ల వాద‌న మ‌రోలా ఉంది. బాబుకు స్వాగ‌తం ప‌లుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు.. అంత‌కు ముందే ఏర్పాటు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలకు అడ్డుగా పెట్ట‌టాన్ని త‌ప్ప ప‌డుతున్నారు.

త‌మ అధినేత ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఫ్లెక్సీలు క‌నిపించ‌కుండా ఉండేలా టీడీపీ వ‌ర్గాలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయ‌టాన్ని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. దీంతో.. రెండు పార్టీలకు చెందిన నేత‌లు. . కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య వివాదం ఘ‌ర్ష‌ణగా మారింది.

ఈ ఉదంతం గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘ‌ట‌నా స్థ‌లానికి వ‌చ్చి ఇరు వ‌ర్గాల్ని శాంతింప‌చేసే ప్ర‌య‌త్నం చేశారు. ఫ్లెక్సీల వివాదం నేప‌థ్యంలో అర్థ‌రాత్రి వేళ‌.. ఇరు పార్టీల వారి పోటాపోటీ నినాదాల‌తో ఆ ప్రాంత‌మంతా ద‌ద్ద‌రిల్లింది. చంద్ర‌బాబు స్వ‌యంగా ప్రాతినిధ్యం వ‌హించే ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఇలా జ‌ర‌గ‌టాన్ని టీడీపీ నేత‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారు. దీంతో.. అధికార‌.. విప‌క్ష పార్టీ ల మ‌ధ్య హ‌డావుడి దాదాపు నాలుగు గంట‌ల పాటు సాగింది. ఇదిలా ఉంటే.. జాతీయ ర‌హ‌దారిని అడ్డుకున్న నేత‌ల కార‌ణంగా రాక‌పోక‌లు నిలిచి.. భారీ ట్రాఫిక్ జాంకు కార‌ణ‌మైంది.
Tags:    

Similar News