మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు.. ఒక మండలానికి ఎస్ఐగా పనిచేస్తున్న పోలీస్ అధికారిపై ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. చిత్తూరు జిల్లా ఎస్పీకి ఈ మేరకు లేఖ రాయడంపై అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. జిల్లా టీడీపీ నేతలు చేయాల్సిన పనిని చంద్రబాబు చేయడం ఏంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
చిత్తూరు జిల్లా ఎస్పీకి చంద్రబాబు రాసిన లేఖ ఇంటా బయటా చర్చకు దారితీసింది. సొంత జిల్లాలో.. సొంత కుప్పం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలను ఎస్ఐ వేధిస్తున్నారని చంద్రబాబు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన ఓ మహిళను కుప్పం నియోజకవర్గంలోని రాళ్లబుడుగూరు ఎస్ఐ మురళీమోహన్ బెదిరించారని లేఖలో చంద్రబాబు ఫిర్యాదు చేశారు. రవికుమార్ అనే టీడీపీ కార్యకర్తను కూడా అరెస్ట్ చేశారని పేర్కొన్నారు.
అంతా అంతా బాగానే ఉన్న ఒక ఎస్ఐపై మాజీ ముఖ్యమంత్రి ఫిర్యాదు చేయడం వరకు వెళ్లడంపై చర్చ జరుగుతోంది. జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో ఎంతోమంది టీడీపీ నేతలున్నా.. చంద్రబాబే ఎందుకు ఎంట్రీ ఇచ్చారన్నది ఆసక్తిగా మారింది. పార్టీ నేతలంతా ఏం చేస్తున్నారనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. దీన్ని పార్టీ టీడీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఎవరూ పట్టించుకోకపోవడంలో బాబు స్పందించాల్సి వచ్చిందని అనుకుంటున్నారు. ఇలాంటి లెటర్ల వల్ల చంద్రబాబు పరపతి మరింత పలుచన అవుతుందని అంటున్నారు.