భారత ఆర్థిక వ్యవస్థపై రాజన్ సంచలన వ్యాఖ్యలు!

ప్రపంచాన్ని ఆవహించిన కరోనా వైరస్ కు వ్యాక్సిన్ మాత్రమే ప్రత్యామ్మాయం అని అందరూ భావిస్తున్నారు. తాజాగా ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ గురించి వార్తలు రాగానే అంతర్జాతీయ మార్కెట్లు లాభల్లో ముగిశాయి.
కానీ వ్యాక్సిన్ వచ్చినప్పటికీ కరోనా ప్రభావం ఆర్థిక వ్యవస్థలపై ఎక్కువ కాలం ఉంటుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ చెబుతున్నారు. భారత్ వంటి దేశాల్లో సుధీర్ఘ లాక్ డౌన్ తో ఆర్థిక వ్యవస్థ రికవరీ కావడం ఇప్పట్లో సాధ్యం కాదని రాజన్ స్పష్టం చేశారు.కరోనా వైరస్ తో వ్యాపారాలు పడిపోయాయని.. అధిక వ్యయాలతో కొన్ని వ్యాపారాలు మూతబడ్డాయని.. చాలా కాలం పాటు ఆర్థిక వ్యవస్థపై ఈ ప్రభావం ఉంటుందని ఆయన తెలిపారు.
వ్యాక్సిన్ వచ్చినా ఇన్ని కోట్ల మందికి టీకాలు వేయాల్సి ఉంటుందని.. అందుకే ఆర్థిక వ్యవస్థలపై పెను ప్రభావం ఉంటుందని రఘురాం రాజన్ చెబుతున్నారు. ప్రజలు మళ్లీ కలుసుకొని టూరిజం, ట్రావెల్, రెస్టారెంట్ లాంటివన్నీ పునరుజ్జీవం అయితే ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందని రఘురాం రాజన్ అన్నారు.