పవన్ కు షాక్: జనసేన కీలక నేత రాజీనామా
పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ అధికార ప్రతినిధి పి.విజయబాబు రాజీనామా చేశారు. తన రాజీనామా నిర్ణయానికిగల కారణాలను ఆయన స్పష్టంగా వెల్లడించలేదు. వ్యక్తిగత కారణాలతో పార్టీని వీడుతున్నట్లు మాత్రమే ప్రకటించారు.
విజయబాబు వివాదరహితుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సమాచార హక్కు(ఆర్ టీఐ) చట్టం కమిషనర్ గా పనిచేశారు. విజయవంతమైన ఎడిటర్ కూడా. ఈ ఏడాది జులైలోనే ఆయన జనసేనలో చేరారు. పార్టీ అధికార ప్రతినిధిగా ఇన్నాళ్లూ బాధ్యతలు నిర్వర్తించారు. మంచి వ్యక్తిత్వం గల వ్యక్తిగా పేరున్న ఆయన కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే పార్టీని వీడటం ప్రస్తుతం కలకలం సృష్టిస్తోంది. ఆయన రాజీనామాతో పవన్ సహా జనసేన ఇతర నేతలు - కార్యకర్తలు కూడా దిగ్భ్రాంతికి గురవుతున్నట్లు తెలుస్తోంది.
తన రాజీనామాకు గల కారణాలను విజయబాబు బయటకు స్పష్టంగా వెల్లడించలేదు. వ్యక్తిగత కారణాల వల్లే పార్టీని వీడుతున్నట్లు ఆయన చెప్తున్నారు. అయితే - జనసేనలో అంతర్గత పరిస్థితులు సరిగా లేవన్న విషయం విజయబాబు రాజీనామాతో స్పష్టమవుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నాదెండ్ల మనోహర్ - రావెల కిశోర్ బాబు వంటి ఫక్తు రాజకీయ నాయకులు జనసేనలో చేరడం ఆ పార్టీలోని పాత నేతలకు రుచించడం లేదు కావొచ్చని సూచిస్తున్నారు. నాదెండ్ల రాకతో ఇప్పటికే తోట చంద్రశేఖర్ - మాదాసు వంటి వారు సైలెంటయిన సంగతిని గుర్తుచేస్తున్నారు. వారు కూడా త్వరలోనే పార్టీని వీడే అవకాశాలను కొట్టిపారేయలేమని చెబుతున్నారు. రాజకీయాలను సంస్కరిస్తానని చెప్తూ పవన్ మళ్లీ ఫక్తు రాజకీయ నేతలనే పార్టీలోకి తీసుకుంటుండటం రుచించకపోవడం వల్లే విజయబాబు రాజీనామా చేసి ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.