మోడీ స‌ర్కారును షేక్ చేస్తున్న తెలుగు.. సౌత్‌!

Update: 2018-01-13 10:20 GMT
ఎక్క‌డ‌?  ఎలా? అన్న సందేహాలు రావొచ్చు. కానీ.. త‌ర‌చిచూస్తే.. ఇది నిజ‌మేన‌నిపించ‌క మాన‌దు. తిరుగులేని మెజార్టీతో పాటు.. విప‌రీత‌మైన ప్రజాద‌ర‌ణ‌తో దూసుకెళుతున్న ప్ర‌ధాని మోడీని అడ్డుకునేవాడు.. ఎదురు చెప్పే నేత దేశంలో ఎవ‌రూ లేర‌ని చెప్పక త‌ప్ప‌దు. ఇలాంటి వేళ‌లో చోటు చేసుకునే అనూహ్య ప‌రిణామాలు అప్ప‌టివ‌ర‌కూ ఉన్న వాతావ‌ర‌ణాన్ని మొత్తంగా మార్చేస్తుంది. ఇప్పుడు అలాంటి ప‌రిస్థితే మోడీ స‌ర్కారు ఎదుర్కొంటోంద‌న‌న అభిప్రాయం ప‌లువురి నోట వినిపిస్తోంది.

న‌లుగురు సీనియ‌ర్ సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తులు.. బ‌య‌ట‌కు వ‌చ్చి విడిగా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయ‌టంం.. అందుకు సుప్రీం చీఫ్ జ‌స్టిస్ మీద ఆరోప‌ణ‌లు చేయ‌టం అనూహ్యం.. సంచ‌ల‌నంగా మారింది. ఈ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన లేఖ‌పై చ‌ర్య‌లు ఏమిట‌న్న‌ది స్ప‌ష్ట‌త రావ‌టం లేదు.

ఏమైనా.. సుప్రీం న్యాయ‌మూర్తులు పెట్టిన ప్రెస్ మీట్ సంచ‌ల‌నంగా మారింది. ఈ ప్రెస్ మీట్‌ ను ఏర్పాటు చేసిన న‌లుగురిలో ఇద్ద‌రు సౌత్ ఇండియా వారు కాగా.. అందులో కీల‌క‌భూమిక పోషిస్తున్నట్లుగా చ‌ల‌మ‌య్య పేరును చెబుతున్నారు. ఎందుకిలా అంటే.. ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది జ‌స్టిస్ చ‌ల‌మేశ్వ‌ర్ ఇంట్లోనే  

ఇక ప్రెస్ మీట్‌కు హాజ‌రైన న‌లుగురు జ‌డ్జిల‌లో ఇద్ద‌రు ద‌క్షిణాది ప్రాంతానికి చెందిన వారు గ‌మ‌నార్హం. మ‌రొక‌రు కొద్ది నెల‌ల్లో రిటైర్ అవుతున్నారు. మ‌రొక‌రు నెల‌ల వ్య‌వ‌ధిలో సుప్రీంకోర్టులో అత్యుత్త‌మ స్థాయికి చేరుకోనున్నారు. ఏతావాతా చెప్పేదేమంటే.. దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఘ‌న‌త ఈ జ‌డ్జిల‌దేన‌ని చెప్పాలి. ఇదిలా ఉంటే..  ఈ న‌లుగురు జ‌డ్జిల‌లో ఇద్ద‌రు ద‌క్షిణాది వారు కావ‌టం విశేషం అందులో ఒక‌రు తెలుగువారు కావ‌టం మ‌రో విశేషంగా చెప్ప‌క త‌ప్ప‌దు.  ఇప్ప‌టికే సౌత్ వాళ్ల‌ను చిన్నచూపు చూస్తున్నార‌ని.. విభ‌జ‌న ఎపిసోడ్ లో తీవ్రంగా న‌ష్ట‌పోయిన ఏపీని అస్స‌లు ప‌ట్టించుకోవ‌టం లేద‌న్న విమ‌ర్శ‌లు ప్ర‌ధాని మోడీ ఎదుర్కొంటున్న వేళ‌.. అదే సౌత్‌.. అదే ఏపీ ప్రాంతానికి చెందిన సుప్రీం న్యాయ‌మూర్తుల కార‌ణంగా కొత్త తిప్ప‌లు తెర మీదకి వ‌చ్చి.. కేంద్రానికి కొత్త త‌ల‌నొప్పులు వ‌చ్చాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News