ఏపీ నుంచే విదేశాలకు.. కియా ఇండియా సంచలనం

Update: 2022-02-04 07:41 GMT
ఏపీలో రెండున్నరేళ్ల కిందట ‘కియా కార్ల’ తయారీ మొదలుపెట్టిన ఆ కంపెనీ ఇప్పుడు రికార్డులు బద్దలు కొడుతోంది. ఈ వాహన తయారీ సంస్థ కియా ఇండియా కొత్త రికార్డు సాధించింది. భారత్ నుంచి ఒక లక్ష కార్ల ఎగుమతి మార్కును అందుకొని రికార్డ్ సృష్టించింది.

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్ లో కంపెనీకి అత్యాధునిక ప్లాంట్ ఉంది. 2019 సెప్టెంబర్ నుంచి ఈ కేంద్రం ద్వారా ఎగుమతులనుకియా మొదలుపెట్టింది. 2022 జనవరి నాటికి 1,01,734 యూనిట్లు నమోదు చేసింది.

రెండున్నరేళ్లలోపే ఈ ఘనతను సాధించామని కియా ఇండియా తెలిపింది. భారత్ ను తయారీ, ఎగుమతి కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు తమ నిబద్ధతను ఇది పునరుద్ఘాటిస్తోందని ఆ సంస్థ వివరించింది.

కియా నుంచి విడుదలైన ‘సెల్టోస్’, సోనెట్ కార్లను మధ్యప్రాచ్య, ఆఫ్రికా, మధ్య, దక్షిణ అమెరికా, మెక్సికో, ఆసియా పసిఫిక్ లోని 91 దేశాలకు కియా ఎగుమతులు చేస్తోంది. విదేశాలకు  వెళుతున్నమొత్తం కార్లలో సెల్టోస్ 77, సోనెట్ 23శాతం వాటా దక్కించుకున్నాయి.

అమ్మకాల పరంగానే కాదు.. తయారీ, ఎగుమతి కేంద్రంగా కూడా కియా కార్పొరేషన్ అభివృద్ధి సాధించింది. భారత్ ఒక వ్యూహాత్మక భౌగోళిక ప్రాంతం అని సంస్థ ఇండియా ఎండీ, సీఈవో టే జిన్ పార్క్ తెలిపారు.

ప్రపంచంలో పెరుగుతున్న డిమాండ్ ను తీర్చడానికి మా అనంతపూర్ ప్లాంట్ చిన్న, మధ్య తరహా ఎస్.యూవీల కోసం అత్యంత క్లిష్టమైన ఉత్పత్తి కేంద్రాలలో ఒకటిగా మారింది. భారతీయ ఉత్పత్తులు నిజంగా అంతర్జాతీయ స్థాయి అనే వాస్తవాన్ని ఇది స్పష్టం చేస్తోంది అని వివరించారు.
Tags:    

Similar News