కొన్ని నిర్ణయాలు ఎందుకు తీసుకుంటారన్న విషయంపై ఎలాంటి స్పష్టత లేకుండా తీసేసుకోవటం కనిపిస్తోంది. ప్రతి పదిహేను రోజులకోసారి పెట్రోల్.. డీజిల్ ధరల్ని సమీక్షించి.. పెంచటమా.. తగ్గించటమా అన్న నిర్ణయాన్ని తీసుకోవటం తెలిసిందే. అయితే.. ధరల్ని ఏ రోజుకు ఆ రోజు సమీక్షించి.. రేట్లను మారిస్తే బాగుంటుందన్న చిత్రమైన ఆలోచనకు తెర తీశాయి పెట్రోలియం కంపెనీలు.
గతంలో అప్పుడప్పుడు మాత్రమే ధరల సమీక్ష జరిగేది. తర్వాతి కాలంలో ప్రతి నెలా రెండుసార్లు సమీక్షించే విధానాన్ని తీసుకొచ్చారు. ఈ రెండు విధానాల్లోనూ.. ప్రజల మీద భారం మోపేటప్పుడు వెనుకాముందు చూసుకోకుండా ధరల్ని పెంచేసే పెట్రోల్ కంపెనీలు.. తగ్గించే విషయానికి వస్తే మాత్రం పినాసితనంతో వ్యవహరించం తెలిసిందే.
అంతర్జాతీయంగా కనిష్ఠ ధరకు ముడిచమురు ధరలు పడిపోయినా.. సగటుజీవి కొనే పెట్రోలు.. డీజిల్ ధరలు ఎంత తగ్గాయో అందరికి తెలిసిన ముచ్చటే. తాజాగా తీసుకురావాలని భావిస్తున్న ఏ రోజు ధర ఆ రోజే విధానంలో కూడా.. అంతర్జాతీయంగా ధర పెరిగిన వెంటనే ఆ భారాన్ని బాదేసి.. తగ్గిన వేళలో మాత్రం ఆచితూచి నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.
తాము అనుకున్నది వెనువెంటనే అమలు చేయాలన్న ఆలోచనలో ఉన్న ఇంధన సంస్థలు.. ఏ రోజుకు ఆ రోజు ధరల్ని అమలు చేసే విధానాన్ని తొలుత ఐదు నగరాల్లో అమలు చేయాలని నిర్ణయించారు. ప్రయోగాత్మకంగా పరిశీలించిన అనంతరం.. దేశ వ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా.. తెలుగు రాష్ట్రాల్లోని వైజాగ్.. పుదుచ్చేరి.. ఉదయ్ పూర్.. జంషెడ్ పూర్.. చంఢీఘర్ లను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నగరాల్ని కన్ఫర్మ్ చేయొచ్చన్న మాట వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/