అమెరికాలో బాంబులు పేలింది భారత్ డబ్బులేనా?

Update: 2015-11-18 04:59 GMT
సమకాలీన కాలంలో ప్రపంచానికి పెద్దన్న అయిన అమెరికాకు వణుకు పుట్టించిన ఘటన ఏదైనా ఉందంటే అది 9/11గా చెప్పాలి. పెద్ద సంఖ్యలో అమెరికన్ల మరణానికి కారణమైన ఈ ఉగ్రవాద కార్యకలపాలకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అమెరికాలోని ఉగ్రవాద దాడుల కోసం భారీగా డబ్బు ఖర్చు కాగా.. ఆ డబ్బు భారత్ నుంచి వెళ్లిందన్న విషయం బయటకు వచ్చింది.

ప్రస్తుతం జైల్లో ఉన్న అఫ్తాబ్ అన్సారీ అమెరికాలో దాడులకు అవసరమైన నిధులు అందించాడన్నది ఆరోపణ. కోల్ కోతాలోని అమెరికాన్ సెంటర్ పై దాడి చేసిన ఘటనలో అతడు నిందితుడిగా ఉన్నాడు. ఇతగాడు 2001లో ఖాదిమ్ వ్యాపార సంస్థల అధిపతి పార్థా ప్రతిమ్ రాయ్ బర్మన్ ను కిడ్నాప్ చేశారు. ఇతడ్ని విడిపించే సమయంలో భారీగా డబ్బులు చేతులు మారింది.

పాకిస్థాన్ లోని ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్న అఫ్తాబ్.. బర్మన్ కిడ్నాప్ ఎపిసోడ్ నుంచి వచ్చిన డబ్బును పాక్ లోని షేక్ ఒమర్ కు పంపాడు. ఇతగాడు ఎవరోకాదు.. కాందహార్ విమానాన్ని హైజాక్ చేసిన ఘటనలో సమయంలో.. అమాయకులైన ప్రయాణికుల్ని కాపాడేందుకు విడుదల చేసిన కరుడుగట్టిన తీవ్రవాది. ప్రస్తుతం పాక్  జైల్లో ఉన్న ఇతగాడికి మొహమ్మద్ అట్టా అత్యంత సన్నిహితుడు. ఈ అట్టానే అమెరికా మీద దాడులకు సంబంధించి స్కెచ్ వేసిన షేక్ ఒమర్ కు డబ్బు అందించింది. ఇలా.. పలు చేతులు మారిన డబ్బుతో.. అమెరికాలోని ట్విన్ టవర్స్ ను పేల్చేయటంతో పాటు వందలాది మంది మరణానికి.. మారణహోమానికి కారణమైంది. ఈ అట్టాను తర్వాత ఎఫ్ బీఐ అదుపులోకి తీసుకుంది. అతడి నోటి నుంచే ఈ డబ్బు వ్యవహారమంతా బయటకు వచ్చింది.
Tags:    

Similar News