వైసీపీ అధ్యక్షుడు జగన్ పై జరిగిన హత్యాయత్నం ఉదంతంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వైఖరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతోన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్ విచారణ వ్యవహారంపై కూడా వైసీపీ నేతలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ దాడి వెనుక చంద్రబాబు కుట్ర దాగుందని పలువురు మంగళవారం నాడు...తనకు ప్రాణహాని ఉందంటూ శ్రీనివాస్...మీడియా ముందు చెప్పడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా చంద్రబాబుపై రాయచోటి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ఏమైనా చేయగల సమర్ధుడని - అందుకే శ్రీనివాస్ కు నార్కో అనాలసిస్ పరీక్ష చేస్తే నిజాలు బట్టబయలవుతాయని శ్రీకాంత్ డిమాండ్ చేశారు. మరోసారి సీఎం కాబోనని చంద్రబాబుకు అర్థమైందని - అందుకే ధర్మపోరాట దీక్షలంటూ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. రాయలసీమ పేరెత్తే అర్హత బాబుకు లేదని - కడప ప్రజల్ని రౌడీలు - గూండాలు అన్న చంద్రబాబు కడప జిల్లాకు ఎలా వచ్చారని ప్రశ్నించారు. వైఎస్సార్ కడప జిల్లాలో చంద్రబాబుది ధర్మ పోరాట దీక్ష కాదని...అది అధర్మ పోరాట సభ అని ఎద్దేవా చేశారు.
జగన్ ను దూషించడమే ఆ సభ ఎజెండా అని శ్రీకాంత్ అన్నారు. అందుకే 6 జిల్లాల నుంచి ఆర్టీసీ బస్సులు పెట్టి బలవంతంగా జనాన్ని కడపకు తరలించారని ఆరోపించారు. చంద్రబాబుకు ఇంత పైశాచిక ఆనందం ఎందుకో తనకు అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబుకు అధర్మం - అన్యాయం మాత్రమే తెలుసని మండిపడ్డారు. జగన్ పై టీడీపీ నేతలు ఇష్టానుసారంగా - అసభ్యంగా వ్యాఖ్యలు చేస్తే చంద్రబాబు పైశాచికానందం పొందారని నిప్పులు చెరిగారు. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని రాయలసీమ ప్రజలందరూ బహిష్కరించాలని కోరారు. కడప స్టీల్ ప్లాంట్ గురించి చంద్రబాబుకు అవగాహన లేదని - కరవుతో రైతులు పడుతోన్న ఇబ్బందులు ఆయనకు తెలీవన్నారు. నాలుగేళ్లు బీజేపీతో కాపురం చేసిన బాబు ఎందుకు నోరు మూసుకున్నారని ప్రశ్నించారు. నాడు రాహుల్ గాంధీని తిట్టిన నోటితోనే నేడు పొగుడుతున్నారని - మోదీని పొగిడిన నోటితోనే తిడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు యూటర్న్ లకు లెక్కలేదని ఎద్దేవా చేశారు.