టీడీపీ అధినేత - మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రభుత్వ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు నీచ రాజకీయాల కోసం ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేయించారని ఆయన ఆరోపించారు. వెన్నుపోట్లు - కుట్ర రాజకీయాలకు చంద్రబాబే ఆధ్యుడని తీవ్రంగా విమర్శించిన శ్రీకాంత్ రెడ్డి.. దివంగత నేత వంగవీటి రంగాను చంద్రబాబు ఎలా చంపించారో మాజీ ఎంపీ హరిరామ జోగయ్య తన పుస్తకంలో వెల్లడించిన విషయాన్ని సైతం ప్రస్తావించారు. ఐదేళ్ల టీడీపీ పాలన లక్షల కోట్లు దోపిడి జరిగిందన్న శ్రీకాంత్ రెడ్డి త్వరలోనే చంద్రబాబు - లోకేష్ బాగోతం అంతా బయటకు వస్తుందని విమర్శించారు.
తాజా ఎన్నికల్లో ఏపీ ప్రజలు చంద్రబాబును చిత్తుగా ఓడించారన్న కక్షతో ఆయన ఏపీకి ఎలాంటి పరిశ్రమలు రాకుండా సోషల్ మీడియాలో తన భజన బృందాలతో ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. టిడిపి మాజీ ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్ - కూన రవికుమార్ ఎన్నికల్లో ఓడిపోయినా రెచ్చిపోతున్నారని శ్రీకాంత్ రెడ్డి విమర్శలు చేశారు. వైఎస్.వివేకా హత్యలో అనుమానితుడిగా ఉన్న శ్రీనివాసులరెడ్డి ఆత్మహత్య చేసుకోవడంతో డీజీపీ స్వయంగా రంగంలోకి దిగారు. ఎన్నికలకు ముందే వివేకా పులివెందులలో తన నివాసంలో హత్యకు గురైన సంగతి తెలిసిందే.
పోస్టుమార్టం నివేదికలో ఆయనది హత్యే అని తేలడంతో అటు జగన్ చంద్రబాబుపై విమర్శలు చేయగా.. చంద్రబాబు కూడా జగన్ ఈ హత్య చేయించారని కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే వైసీపీ బాధితుల కోసం తాను గుంటూరులో పునరావాస శిబిరాలు పెడతానని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై శ్రీకాంత్ రెడ్డి అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి - నరసారావుపేట నియోజకవర్గాల్లో కే ట్యాక్స్ బాధితుల కోసం పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయాలని ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో విచ్చలవిడిగా వ్యవహరించిన కోడెల - యరపతినేని అరాచకాలపై చంద్రబాబు ఎందుకు ? మాట్లాడరని ప్రశ్నించారు.