జాతిపితకు ఐసిస్ ద్రోహం

Update: 2016-01-25 12:46 GMT
అహింస అనే ఆయుధాన్ని ఉద్యమంగా మార్చుకొని ప్రపంచ చరిత్రలో మరే దేశ స్వాతంత్ర్యం పోరాటంలోనూ లేని విధంగా భారతీయులకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాన్ని అందించిన నేత జాతిపిత మహాత్మ గాంధీ. మరి.. అలాంటి మహనీయుడి విగ్రహం మీద మతోన్మాదంతో.. అత్యంత రాక్షంగా వ్యవహరిస్తూ ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న ఐసిస్ భూతం తమ పంజా విసిరింది. రాజస్తాన్ లోని జయపుర లో దుడు ప్రాంతంలో ఈ అమానవీయ ఘటన జరిగింది.

గుర్తు తెలియని వ్యక్తులు గాంధీ జీ విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేయటమే కాదు.. గాంధీ విగ్రహంలోని పలు భాగాల్ని ధ్వంసం చేశారు. అనంతరం.. విగ్రహం ముందు వెనుక ప్రాంతాల్లో ఐసిస్ జిందాబాద్ అంటూ తమ రాక్షసత్వాన్ని చాటుకున్నారు. జనవరి 26న గణతంత్ర వేడుకులకు దేశం తయారవుతున్న వేళ.. ఈ ఘటన చోటు చేసుకోవటం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. హింసకు వ్యతిరేకంగా పెద్ద పోరాటం చేసిన మహాత్ముడి విగ్రహం మీద చేసిన దాడిని పలువురు ఖండిస్తున్నారు. తాజా ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
Tags:    

Similar News