విజయవాడలో సామూహిక అత్యాచారంపై ప్రజలు, ప్రజాసంఘాలు వివిధ పార్టీల నేతలు భగ్గుమన్నారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రి వద్ద భైటాయించి ఆందోళన నిర్వహించారు. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సామూహిక అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ ఆస్పత్రికి వచ్చారు.వారిద్దరూ ఆస్పత్రి వద్దే వాగ్వాదానికి దిగారు. మీరే చేశారంటూ ఆడిపోసుకున్నారు. దీంతో విజయవాడ ప్రభుత్వాసుపత్రి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
వాసిరెడ్డి పద్మను బాధితులు, టీడీపీ నేతలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ వైఫల్యం వల్లే ప్రభుత్వాసుపత్రిలో ఈ దారుణం జరిగిందని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, ఇద్దరి మధ్య కొద్ది సేపు వాగ్వాదం చోటుచేసుకుంది.
వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. ‘చంద్రబాబు ముందే టీడీపీ నాయకులు ఇష్టానుసారం వ్యవహరించారని’ వాపోయారు. టీడీపీ నేతలు తనకు వేలు చూపించి కళ్లు పెద్దవి చేసి భయపెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. బోండా ఉమా అయితే నీకు సిగ్గుందా? అన్నారని పద్మ ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పలువురు మహిళలు విజయవాడ ప్రభుత్వాసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆస్పత్రి ప్రధాన మార్గం వద్ద మహిళలు, నేతలు భైఠాయించి నిరసన తెలుపుతున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
చంద్రబాబు, వాసిరెడ్డి పద్మ సమక్షంలో విజయవాడ సీపీ కాంతిరాణా టాటాపై బాధిత కుటుంబ సభ్యులు మండిపడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.