గ్యాంగ్​ స్టర్​ నయీం ప్రధాన అనుచరుడి మృతి..

Update: 2021-02-08 09:10 GMT
గ్యాంగ్​స్టర్​ నయీమ్​ ప్రధాన అనుచరుడు ఎండీ నాసర్​ అనారోగ్యంతో మృతిచెందాడు. నయీమ్​ చేసిన పలు నేరాల్లో నాసర్​ నిందితుడిగా ఉన్నాడు. అయితే అతడు గత కొంతకాలంగా హైదరాబాద్​లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇవాళ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఎండీ నాసర్​పై తెలంగాణ వ్యాప్తంగా పలు పోలీస్​ స్టేషన్లలో కేసులు ఉన్నట్టు సమాచారం. అతడిపై పీడీ యాక్ట్​తో సహా పలు కేసులు ఉన్నాయి. నయీమ్​తో కలిసి.. నాసర్​ పలు సెటిల్​మెంట్లు, భూదాందాల్లో పాల్గొన్నాడు.

నయీమ్​ చేసిన చాలా నేరాల్లో ఎండీ నాసర్​ నిందితుడిగా ఉన్నాడు. నయీమ్​ తెలంగాణలో అనేక భూకబ్జాలు, బెదిరింపులు, కిడ్నాప్​లకు కూడా పాల్పడ్డ విషయం తెలిసిందే. 2016 ఆగస్ట్​ 8న షాద్​నగర్​ సమీపంలో నయీమ్ ను పోలీసులు ఎన్​కౌంటర్​ చేశారు.

ఎన్​కౌంటర్​ అనంతరం నయీం అక్రమాలు ఒక్కొక్కటి బయటకు వచ్చాయి. అతడి ఆస్తుల వివరాలు కూడా వచ్చాయి. తెలంగాణ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నయీంకు 1,019 ఎకరాల భూములు, 29 భవనాలు ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. నయీం ఎన్​కౌంటర్​ తర్వాత అతడి అనుచరులు కూడా చెల్లా చెదురయ్యారు. కొందరు పోలీసులకు లొంగిపోగా.. మరికొందరిని పోలీసులే అరెస్ట్ చేశారు. ఇంకొందరూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
Tags:    

Similar News