గంగూలీ బద్ధకస్తుడు.. అతడి వల్లే టీమిండియా విఫలం..! చాపెల్ వ్యాఖ్యలు..!
భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ గ్రేగ్ చాపెల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ ను ప్రశంసలతో ముంచెత్తిన చాపెల్.. బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీపై నోరు పారేసుకున్నాడు. గంగూలీ బద్దకస్తుడని .. అతడికి టీమిండియా గెలవాలన్న కాంక్ష లేదని.. కేవలం తన కెప్టెన్సీని కాపాడుకోవడానికి మాత్రమే ప్రయత్నించాడని అన్నాడు చాపెల్. అతడు వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. నిజానికి చాపెల్‌ను తీసుకొచ్చింది సౌరవ్ గంగూలీయే.. ఈ విషయాన్ని చాపెల్ కూడా ఒప్పుకున్నాడు.
చాపెల్‌ను కోచ్ గా తీసుకొచ్చి చాలా పెద్ద తప్పు చేశానని.. గతంలో సౌరవ్ గంగూలీ తన ఆత్మకథ ‘ఏ సెంచరీ నాట్ ఏ ఎనఫ్' లో రాశాడు. అంతేకాక చాపెల్ కోచ్ గా ఉన్న సమయంలో పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నాడు. అతడిపై చాలా ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో ఇర్ఫాన్ పఠాన్ బౌలర్ గా రాణిస్తున్నాడు.. కానీ అతడిని బ్యాటింగ్ చేయాలంటూ చాపెల్ సూచించాడు. దీంతో పఠాన్.. ఇటు బౌలింగ్‌కు అటు బ్యాటింగ్ కు పనికిరాకుండా పోయాడు. మరోవైపు భారతజట్టు బ్యాటింగ్ లైనప్లోనూ చాలా మార్పులు చేశాడు చాపెల్. అతడి హయాంలోనే గంగూలీని జట్టు నుంచి తప్పించారు. ఆ తర్వాత విమర్శలు రావడంతో మళ్లీ గంగూలీని తీసుకున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా గ్రేగ్ చాపెల్ మాట్లాడుతూ.. అప్పట్లో తాను తీసుకున్న నిర్ణయాలను సమర్థించుకున్నాడు. రాహుల్ ద్రవిడ్ గొప్ప క్రికెటర్ అని కొనియాడాడు. జట్టును నంబర్ వన్ గా తీర్చిదిద్దేందుకు ద్రవిడ్ ఎంతో కృషి చేశాడని పేర్కొన్నాడు. కానీ అతడికి మిగిలిన క్రికెటర్లు ఎవరూ సహకరించలేదని.. అందుకే 2007 వరల్డ్‌కప్ లో టీమిండియా ఘోరంగా ఓడిపోయిందని పేర్కొన్నాడు.
2005, 07 కాలంలో చాపెల్ కోచ్ గా ఉన్నాడు. ఆ టైంలోనే భారతజట్టు ఘోర పరాజయాలను ఎదుర్కొన్నది.
ఇంకా చాపెల్ ఏమన్నాడంటే..!
‘సౌరవ్ గంగూలీని జట్టు నుంచి తప్పించడం మంచి నిర్ణయమే. ఎందుకంటే ఈ నిర్ణయం వల్లే చాలా మంది ఆటగాళ్లు దారిలోకి వచ్చారు. నా పదవి కాలం ముగిసిన తర్వాత బీసీసీఐ నన్ను జట్టులో చేరాలని కోరింది. కానీ నేను ఆ ఆఫర్ ను తిరస్కరించాను’ అని చాపెల్ పేర్కొన్నాడు.