రెండే పార్టీలు కాదు... ఎన్నో పార్టీలు ఉన్నాయి..అంటే గంటా చెప్పేదేంటో...?
ఏపీలో రెండే పార్టీలు లేవు కదా ఎన్నో పార్టీలు ఉన్నాయంటూ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడినపుడు పార్టీ మార్పు అన్న అంశం చర్చకు వచ్చింది. అయితే దీని మీద ఆయన స్పందిస్తూ తాను పార్టీ మారుతున్నట్లుగా చెప్పానా అని ఎదురు ప్రశ్నించారు. తాను పార్టీ మారితే అపుడు స్వయంగా మీడియా ముందుకు వచ్చి చెబుతాను అని గంటా స్పష్టం చేశారు.
ఇక్కడే ఆయన మరి కొన్ని సందేహాలకు అవకాశం ఇచ్చేలా మాట్లాడారు అని అంటున్నారు. అదెలా అంటే తాను పార్టీ మారను అని ఆయన కచ్చితంగా క్లారిటీగా చెప్పకపోవడమే డౌట్లకు కారణం అవుతోంది. పార్టీ మారితే చెబుతాను అంటే ఆ ఆలోచన ఆయనకు ఉన్నట్లే కదా అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే ఏపీలో రెండే పార్టీలు ఉన్నాయా అని ఆయన మీడియా తో మాట్లాడుతూ మరో ప్రశ్నను లేవనెత్తారు.
కాంగ్రెస్ బీజేపీ జనసేన, కమ్యూనిస్టులు ఇన్ని పార్టీలు ఉన్నాయి కదా అని ఆయన చెప్పడం వెనక ఉద్దేశ్యం ఏమిటి అన్నది ఎవరికీ అర్ధం కావడం లేదు అని అంటున్నారు. మరో వైపు చూస్తే గంటా పార్టీ నిజంగా మారుతారా లేదా అన్నది పక్కన పెడితే మీడియా ప్రతినిధులే గందరగోళంలో ఉండి తనను ప్రశ్నిస్తున్నారు అని ఆయన అంటున్నారు.
మరి గంటా పార్టీ మార్పు ఉంటుందా ఉండదా అన్నది కూడా చూడాల్సిన వ్యవహారమే. మరో వైపు చూస్తే గంటా వైసీపీలో చేరుతారు అని ఆ మధ్యన ప్రచారం సాగింది. దానికంటే ముందు జనసేనలో చేరుతారు అన్న ప్రచారం సాగింది. ఇపుడు చూస్తే గంటా తాను పార్టీ మారడంలేదు అంటూనే మారితే చెబుతాను అని ట్విస్ట్ ఇచ్చారు.
గంటా ఇంతకీ పార్టీ మారుతారా అసలు మారాల్సిన అవసరం ఆయనకు ఉందా అన్నది కూడా చర్చగానే ఉంది. తెలుగుదేశంలో సీనియర్ నేతగా ఉన్నారు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే. సిట్టింగులు అందరికీ వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని చంద్రబాబు ఇప్పటికే చెప్పారు. అలాంటి అవకాశం ఉండి కూడా గంటా దాన్ని వాడుకోకుండా పార్టీ మార్పు అని వస్తున్న ప్రచారాన్ని ఖండించం వరకే పరిమితం అవుతున్నారు అని అంటున్నారు.
దానిని బట్టి గంటా మనసులో పార్టీ మార్పు అన్నది నిజంగా ఉందేమో అన్న ఆలోచనలు కూడ తమ్ముళ్లలో రేకెత్తిస్తునారు అని అంటున్నారు. ఇక విశాఖలో కాపునాడు సభను ఈ నెల 26న నిర్వహిస్తున్నారు. ఆ సభకు అన్ని పార్టీల నుంచి పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు, ప్రతినిధులు హాజరవుతారు. బహుశా అ సభ తరువాత గంటా తన పార్టీ మార్పు మీద పూర్తి స్థాయిలో క్లారిటీ ఇస్తారని అంటున్నారు. ఏది ఏమైనా గంటా పార్టీ మార్పు మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ అని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.