వ్యాపారం అన్న తర్వాత అప్పు అన్నది చాలా కామన్. కానీ.. ఇదే కొన్నిసార్లు కొంపముంచుతుంది. సరిగ్గా ఇప్పుడు అదే జరిగింది. పవర్ ఫుల్ మీడియా సంస్థ 'ఎన్ డీటీవీ' ప్రపంచ కుబేరుల్లో ఒకరైన గౌతమ్ అదానీ చేతుల్లోకి వెళ్లేందుకు వారు చేసిన అప్పే కారణంగా చెప్పొచ్చు. అప్పు ఇంత ముప్పుగా మారిందా? అని కిందా మీదా పడే పరిస్థితి. ఎందుకిలా? అంటే.. బ్రేకింగ్ న్యూస్ లను ప్రసారం చేసే ఎన్ డీటీవీ.. తనకు తాను బ్రేకింగ్ న్యూస్ అవుతానని.. తనను కొనుగోలు చేసిన విషయం తనకు తెలీకుండా జరుగుతుందని అస్సలు అనుకొని ఉండదు. అదానీ పుణ్యమా అని అలా జరిగిపోయాయి. అసలేం జరిగిందన్నది చూస్తే.. ఎన్ డీటీవీ మీడియా సంస్థను గౌతమ్ అదానీ చేజిక్కించుకున్న తీరు మొత్తం సినిమాటిక్ గా సాగిందని చెప్పక తప్పదు.
'న్యూఢిల్లీ టెలివిజన్' అన్న పేరు చెబితే ఎవరికి అర్థం కాదు. ఆ మాటకు వస్తే చాలా ప్రముఖ మీడియా సంస్థల పేర్లు ఒకలా.. వారి బ్రాండ్లు మరోలా ఉండటం తెలిసిందే. ప్రతి తెలుగువాడికి సుపరిచితమైన 'ఈనాడు'.. ఉషోదయ పబ్లికేషన్స్ పేరుతో.. 'సాక్షి'.. జగతి పబ్లికేషన్స్.. ఆంధ్రజ్యోతి.. ఆమోద పబ్లికేషన్స్ పేరుతో ఉంటుంది. అలానే 'న్యూఢిల్లీ టెలివిజన్' అంటే.. ప్రముఖ టీవీ చానల్ అయిన 'ఎన్ డీటీవీ'. దీని ప్రమోటర్ గ్రూపు సంస్థ పేరు ఆర్ఆర్ పీఆర్ (రాధికా రాయ్ ప్రణయ్ రాయ్) గా చెప్పాలి.
ఈ మీడియా సంస్థలో అత్యధిక వాటాను ప్రపంచ కుబేరుల్లో ఒకరైన గౌతమ్ అదానీ సొంతం చేసుకున్న విషయం.. ఎన్ డీటీవీ వ్యవస్థాపకులైన ప్రణయ్ రాయ్.. రాధికా రాయ్ కు కూడా తెలీకుండా సాగటం చూస్తే.. అదానీ అంటే ఏమిటో ఈ డీల్ ను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ఎన్ డీటీవీలో మేజర్ షేర్ అదానీ సొంతం చేసుకున్నారన్న వేళ.. ఆ విషయం తమకు తెలీదంటూ భార్యభర్తలు (ప్రణయ్ రాయ్.. రాధికా రాయ్)ఇద్దరు చెప్పిన మాటకు చాలామంది షాక్ తిన్నారు. అదెలా సాధ్యమన్న సందేహం పలువురికి వచ్చింది.
దీంతో కాస్తంత లోతుగా విషయాల్లోకి వెళితే.. ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఎన్ డీటీవీ వ్యవస్థాపకులు గతంలో చేసిన ఒక అప్పు ఇప్పుడు ముప్పుగా మారి.. అదానీ చేతుల్లోకి శక్తివంతమైన మీడియా సంస్థ వెళ్లేలా చేసిందని చెబుతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా తెర వెనుక కథ నడిపిన అదానీ మాష్టారి దెబ్బకు అంతటి మీడియా సంస్థలో మెజార్టీ వాటా సులువుగా లభించిందని చెప్పాలి. ఎన్ డీ టీవీ ప్రమోటర్ కంపెనీ అయిన 'ఆర్ఆర్ పీఆర్ హోల్డింగ్ ప్రైవేటు లిమిటెడ్' సంస్థకు వీసీపీఎల్ (విశ్వప్రదాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్) రూ.403.85 కోట్ల వడ్డీ లేని అప్పును ఇచ్చింది. ఒకవేళ ఈ రుణాన్ని తీర్చని పక్షంలో ఆర్ఆర్ పీఆర్ లోని 99.9 శాతం వాటాగా మార్చుకోవచ్చని ఒప్పందం కుదుర్చుకున్నారు.
కాలక్రమంలో ఆ అప్పును తీర్చకపోవటం.. ఈ సంస్థ మీద కన్నేసిన అదానీ.. గుట్టుచప్పుడు కాకుండా వీసీపీఎల్ యాజమాన్యం చేతులు మారింది. దాన్ని అదానీ గ్రూపునకు సంబంధించిన సంస్థ కొనుగోలు చేసింది. ముందస్తుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం 29.18 శాతం వాటాగా అప్పును మార్చుకుంది. దీంతో ఎన్ డీటీవీలో భారీ వాటాను సొంతం చేసుకుంది. దీనికి అదనంగా మరో 26 శాతం వాటా కొనుగోలు కోసం ఓపెన్ ఆఫర్ ప్రకటించటం తెలిసిందే.
ఇది కూడా పూర్తి అయితే.. ఎన్ డీటీవీలో సగం వాటా అదానీ చేతుల్లోకి వెళ్లిపోతుంది. మొత్తంగా చూస్తే.. గతంలో చేసిన అప్పును దశల వారీగా తీర్చేసి ఉంటే సీన్ మరోలా ఉండేది. అందుకు భిన్నంగా అప్పును అలానే ఉంచేయటం.. తెలివిగా ఈ విషయాల్ని గుర్తించిన అదానీ సినిమాటిక్ గా సదరు మీడియా సంస్థలో మేజర్ షేర్ ను సొంతం చేసుకోవటానికి ఛాన్సు లభించినట్లుగా చెప్పాలి.