ఇప్పుడు వారి జర్నీ అంతా అమెరికాకే..!

Update: 2015-06-29 13:36 GMT
స్వలింగ సంపర్కుల ఆనందం అంబరాన్ని తాకేలా అమెరికా సుప్రీంకోర్టు తాజాగా తీర్పు ఇవ్వటం తెలిసిందే. స్వలింగ సంపర్కులు వివాహానికి చట్టబద్ధమైన అనుమతి దొరకటంతో ఇప్పుడు ''గే''లు సరికొత్త ప్లాన్లు వేస్తున్నారు.

అమెరికా ఇచ్చిన చారిత్రక రూలింగ్‌ నేపథ్యంలో అమెరికాలో సంబరాలు చేసుకోవాలని భావిస్తున్నారు. దేశానికి చెందిన పలువురు గేలు అమెరికాకు వెళ్లేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. నిజానికి.. ఇప్పటికే పలు దేశాల్లో గే వివాహాలకు చట్టబద్ధమైన అనుమతి ఉన్నప్పటికీ.. తాజాగా అమెరికా అందుకు సానుకూలంగా స్పందించటంతో ఇప్పుడు ఇతర దేశాలకు వెళ్లాలని భావిస్తున్న వారంతా కూడా అమెరికాకు వెళ్లేందుకు ప్లాన్స్‌ మార్చేసుకుంటున్నారు.

గేలకు అనుకూలంగా ఉండే దేశాల్లో చదువుకోవాలని.. ఉద్యోగాలు చేయాలని భావిస్తున్న వారంతా.. అమెరికాలో మారిన చట్టంతో.. అమెరికాకు వెళ్లాలని నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. మొత్తానికి గేలకు అమెరికా స్వర్గధామంగా మారనుందన్న మాట.

Tags:    

Similar News