ఉక్కు మహిళను వదలని కరోనా

Update: 2020-03-23 07:00 GMT
ప్రపంచంలో అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా ఎక్కడైనా సరే.. చొచ్చుకెళ్లిపోతోంది కరోనా. ఈ వైరస్ కు విపరీతమైన ఆత్మాభిమానమంటూ సోషల్ మీడియాలో జోకులు వెల్లువెత్తినా.. వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉందంటున్నారు. అంత ఆత్మాభిమానం ఎక్కువే అయితే.. పిలవని పేరంటంలా.. ఎవరిలో పడితే వారిలో నిర్మోహమాటం.. నిర్దాక్షిణ్యంగా తిష్ట వేస్తున్న ఈ వైరస్ పుణ్యమా అని దేశాలకు దేశాలు కరోనా బారిన పడి అతలాకుతలమైపోతున్నాయి. ఎవరి దాకానో ఎందుకు? ప్రపంచానికి పెద్దన్న అమెరికా పరిస్థితి ఇప్పుడెలా ఉందో చూస్తున్నాం కదా.

అక్కడి వారికి శుచి.. శుభ్రం ఎక్కువని.. చాలా జాగ్రత్తగా ఉంటారని చెబుతున్నప్పుడు.. మరి అలాంటి దేశంలోని మహా నగరాల్లో కరోనా వేస్తున్న వీరంగం అంతా ఇంతా కాదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. సంపన్న దేశాలకు కేరాఫ్ అడ్రస్ గా.. విందులతో వినోదాలతో జీవితం మొత్తం బాలీవుడ్ మూవీలా ఉండే యూరప్ ఇప్పుడు హాహాకారాలు చేస్తోంది. చివరకు పవర్ ఫుల్ దేశాధ్యక్షురాలు సైతం కరోనా బారిన పడే దుస్థితి. తాజాగా జర్మనీ ఛాన్సలర్ 65ఏళ్ల ఏంజెలా మెర్కెల్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు.

తాజాగా ఆమె.. కరోనా బారిన పడినట్లుగా వైద్యులు నిర్దారించారు. దీంతో.. ఆమె ఇంటి నుంచే తన కార్యకలాపాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆమెకుక్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం జర్మనీలో 24వేల మంది కరోనా వైరస్ బారిన పడగా.. ఆ దేశంలో ఇప్పటివరకూ ఈ మాయదారి పిశాచి బారిన పడి 94 మంది మరణించారు.

ఉక్కుమహిళగా పేరున్న ఏంజెలా మెర్కెల్.. తాజాగా కరోనా బారిన పడటంతో.. ఆమె తీసుకోవాల్సిన కీలక నిర్ణయాల్ని.. ప్రకటనల్ని ఆర్థిక మంత్రి ఓలాఫ్ స్కోల్జ్ ప్రకటించే వీలుందని చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయంలో ఏమంటే.. గత వారం జలుబుతో తీవ్ర ఇబ్బందికి గురైన ఆర్థిక మంత్రి స్వీయ క్వారంటైన్ విధించుకోగా.. ఇప్పుడు దేశ ఛాన్సలర్ కే కరోనా పాజిటివ్ అని తేలటంతో ఆ దేశం ఉలికిపాటుకు గురైంది. ప్రస్తుతం ఆమెకు న్యుమోనియాకు చెందిన టీకాలు వేసినట్లుగా తెలుస్తోంది.






Tags:    

Similar News