అంచనాలు నిజమయ్యాయి. ఊహాగానాలు వాస్తవాలయ్యాయి. సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు కమ్ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు టీడీపీలో చేరే విషయంపై క్లారిటీ ఇచ్చేశారు. ఇకపై తెలుగుదేశం పార్టీకి ఘట్టమనేని కుటుంబం పూర్తి మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. తాను వైఎస్సార్ కాంగ్రెస్ ను విడిచిపెట్టి తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు.
ఇకపై ఘట్టమనేని కుటుంబం పూర్తి మద్దతు తెలుగుదేశానికేనని స్పష్టం చేశారు. అంతేకాదు.. తెనాలి నుంచి అలపాటి రాజేంద్రప్రసాద్ పోటీ చేస్తారని చెప్పిన ఆదిశేషగిరి రావు.. తన రాజకీయ భవిష్యత్తు ఏమిటన్నది పార్టీ డిసైడ్ చేస్తుందని చెప్పారు.
బుర్రిపాలెంలో ఆదిశేషగిరిరావును కలిసిన ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య.. పార్టీ చీఫ్ విప్ బుద్దా వెంకన్న.. విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తదితరులు ఆదిశేషగిరిరావుతో భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర చర్చల అనంతరం.. శేషగిరిరావు ఈ నెల ఏడున పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. కృష్ణ.. మహేశ్ అభిమానులతోచర్చలు జరిపిన తర్వాతే తానీ నిర్ణయాన్ని వెల్లడిస్తున్నట్లుగా ఆదిశేషగిరిరావు ప్రకటించారు. టీడీపీలో చేరాలన్న నిర్ణయాన్ని 13 జిల్లాలకు చెందిన కృష్ణ.. మహేశ్ ఫ్యాన్స్ కు చెందిన ముఖ్యులు బుర్రిపాలెం వచ్చి చర్చలు జరిపారు. అనంతరం తన నిర్ణయాన్ని అదిశేషగిరిరావు అధికారికంగా వెల్లడించారు. సో.. కృష్ణ.. మహేశ్ ఫ్యాన్స్.. ఘట్టమనేని ఫ్యామిలీ పొలిటికల్ సపోర్ట్ ఎవరికన్న విషయంపై క్లారిటీ వచ్చేసిందిగా?