ప్రముఖులు కొందరు కొన్ని విషయాల్లో ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించాల్సిందే. మిగిలిన వారి మాదిరే వారికి భావోద్వేగాలు ఉన్నప్పటికీ.. వాటిని కంట్రోల్ చేసుకోవటంలో ఏ మాత్రం లెక్క తేడా వచ్చినా.. అనవసరంగా వార్తల్లోకి ఎక్కటం.. దాంతో మరింత ఫస్ట్రేషన్ కావటం పక్కా. తాజా పరిణామంఈ కోవకు చెందిందే.
ఈ రోజు మధ్యాహ్న సమయంలో టీవీల్లో బ్రేకింగ్ న్యూస్ అంటూ ఒక వార్త పలువురి దృష్టిని ఆకర్షించింది. సినీ హీరో తారకరత్నకు చెందిన హోటల్ ను జీహెచ్ ఎంసీ అధికారులు కూల్చేస్తున్నారన్న వార్త సంచలనంగా మారింది. బంజారాహిల్స్ లోని రోడ్డు నంబరు 12లో ఉన్న డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ ను గ్రేటర్ అధికారులు కూల్చే ప్రయత్నం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్ పై స్థానికులు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేయటం.. దీంతో వారు రెస్టారెంట్ నిర్మాణాన్ని కూల్చేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్నంతనే తారకరత్న రెస్టారెంట్ వద్దకు చేరుకున్నారు. ఎందుకు కూల్చి వేస్తున్నారంటూ ప్రశ్నించారు. రాత్రివేళలో మద్యం.. డీజే శబ్దాలతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారని.. సొసైటీ సభ్యులు తమకు ఫిర్యాదు చేయటంతో తాము కూల్చివేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జీహెచ్ ఎంసీ అధికారులకు.. తారకరత్నకు నడుమ వాగ్వాదం చోటు చేసుకుంది. తమకు కొంత సమయం ఇస్తే.. రెస్టారెంట్ సామాగ్రిని బయటకు తరలిస్తామని అధికారుల్ని కోరటంతో.. వారు మూడు గంటల పాటు సమయం ఇచ్చారు. యుద్ధ ప్రాతిపదికన రెస్టారెంట్ లోని సామాగ్రిని తరలించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే రూల్స్ ను భిన్నంగా ఏర్పాటు చేసిన రెస్టారెంట్ తారకరత్నది కాదు. ఆయన స్నేహితుడిది.కాకుంటే.. రెస్టారెంట్ ఏర్పాటు చేసిన స్థలం మాత్రమే తారకరత్నది.
తన స్నేహితుడికి మాట సాయంగా వచ్చిన తారకరత్న మీద మీడియా ఫోకస్ పడటంతో.. తారకరత్నకు చెందిన రెస్టారెంట్ ను అధికారులు కూల్చేస్తున్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. అందుకే.. ప్రముఖులు తొందరపడి కొన్ని విషయాల్లో జోక్యం చేసుకునే కంటే.. కాస్త దూరంగా ఉండటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.