గత సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ లో జరిగిన ఓ ప్రమాద ఘటన అనేకమందిని ఒళ్లు గగుర్పాటుకు గురయ్యేలా చేసిన సంగతి తెలిసిందే. ఎల్బీనగర్ లోని షైన్ చిల్డ్రన్ హాస్పిటల్ యాజమాన్యం ఆస్పత్రి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఐసీయూలో షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకోవడం - నాలుగు నెలల చిన్నారి మృతి చెందడం - ఐదుగురు తీవ్రంగా గాయపడటం అనేకమందిని కలచివేసింది. అయితే, ఈ ఘటనతో అధికారులు మేల్కొన్నారో లేదా... `విధి నిర్వహణ`లో ఉన్నారో తెలియదు కానీ...నిబంధనలు పాటించని ఆస్పత్రులను గుర్తించి వారికి నోటీసులు జారీ చేశారు. చిన్నారులు ప్రాణాలు పోతే కానీ అధికారుల్లో స్పందన లేదని ఈ పరిణామంపై పలువురు మండిపడుతున్నారు.
అధికారులు ఓ వైపు షైన్ ఘటనపై స్పందిస్తూనే..మరోవైపు ఈ ఘటన వంటివి జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రమాదం సంభవించడానికి గల కారణాలపై అన్నిశాఖల నుంచి సమాచారం సేకరించి పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్ వో స్వరాజ్యలక్ష్మి తెలిపారు. ఈ ఘటనపై అన్నివిభాగాల నివేదికలు ఇవ్వాలని కోరామని ఏసీపీ పృథ్వీధర్ రావు తెలిపారు. డీఎంహెచ్ వో - జీహెచ్ ఎంసీ - ఫైర్ - విద్యుత్ శాఖ అధికారుల నుంచి అగ్నిప్రమాదానికి గల కారణాలపై నివేదికలు అడిగామని, ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం 304/ఏ ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదుచేసుకొన్న పోలీసులు - నివేదిక వచ్చాక యాజమాన్యంపై హత్యానేరం కింద కేసు నమోదుచేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.
ఇదిలాఉండగా, ఇలాంటి ఆస్పత్రులు అనేకం భద్రతా ప్రమాణాలను గాలికి వదిలేశాయని అధికారులు గుర్తించారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ - జీహెచ్ ఎంసీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ విభాగం అధ్యయనంలో ఏకంగా 1600 ఆసుపత్రుల్లో ఫైర్ సేఫ్టీ లేదనే విషయం స్పష్టమైనట్లు సమాచారం. 1600 ఆసుపత్రులకు విపత్తు నిర్వహణ విభాగం నోటీసులు జారీ చేసి ఫైర్ సేఫ్టీ కి సంబంధించి చర్యలు తీసుకోకుంటే కఠినంగా వ్యవహరిస్తామని, ఆసుపత్రులను సీజ్ చేస్తామని ఆ నోటీసులో పేర్కొంది. షైన్ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంతో మేలుకున్న విపత్తు నిర్వహణ అధికారులు ఆసుపత్రులలో అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోవాలని - ఒకవేళ అగ్ని ప్రమాదాలు జరిగినా వాటిని వెంటనే ఎవరికి ఎలాంటి హాని లేకుండా అదుపు చేసేందుకు ఫైర్ సేఫ్టీ ఉండాలని ఇప్పుడు ఆదేశాలు ఇవ్వడం సహజంగానే...పలువర్గాలను విస్మయానికి గురిచేస్తోంది.
ఇదిలాఉండగా - షైన్ ఆస్పత్రి అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చంపాపేట ప్రాంతానికి చెందిన ముత్యాలు - సరిత దంపతుల 36 రోజుల వయస్సు గల పాప ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. చిన్నారిని బంజారాహిల్స్ లోని అంకుర దవాఖానలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పాప పొట్ట భాగంలో తీవ్ర గాయాలు కావడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని - పాప పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. మరో పాప కోలుకుంటోందని సమాచారం.