బాబు ఇంటికి నీళ్లు బంద్ చేసిన జీహెచ్ ఎంసీ

Update: 2016-05-05 05:45 GMT
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హైద‌రాబాద్‌ లోని నివాసానికి గ్రేట‌ర్ హైద‌రాబాద్ అధికారులు వాసులు నీటిని నిలిపివేశారు. అయితే చిత్రంగా ఆయ‌న‌ క్యాంప్‌ ఆఫీసుకు మాత్రం ఫుల్‌గా నీళ్లు సరఫరా అవుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హైదరాబాద్‌ నుంచి ప‌రిపాల‌న  మార్చి విజయవాడ కేంద్రంగా తాత్కాలిక ప‌రిపాల‌న కొనసాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో చంద్రబాబు ఇంటికి నీళ్లు - కరెంటు సరఫరా కట్‌ చేయాలని ఓయూ జేఏసీ జీహెచ్‌ ఎంసీ కమిషనర్‌ కు వినతిపత్రమిచ్చింది. దీంతో తాజా నిర్ణ‌యం అమ‌ల్లోకి వ‌చ్చింద‌ని చెప్తున్నారు.

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బంజారహిల్స్‌ లోని రోడ్‌ నెం.65లో పాత ఇంటిని కూల్చి కొత్త ఇల్లును నిర్మిస్తున్నారు. ఇంటి అనుమతుల విషయంలో ఇప్పటికే జీహెచ్‌ ఎంసీతో వివాదం జరిగింది. ఇంటి నిర్మాణం సందర్భంగా నీటి సరఫరా బంద్‌ చేయాలని కోరడంతో జలమండలి అధికారులు పూర్తిగా నిలిపివేశారు. ఇంటి నిర్మాణ స్థలంలో ఉన్న బోరు నీటినే ఇంటి అవసరాలకు వినియోగిస్తున్నారు. ఇంటి నిర్మాణం వల్ల బంజారహిల్స్‌ లోని రోడ్‌ నెం.24లో చంద్రబాబునాయుడు అద్దెకు ఉన్నారు. దాంతో అక్కడకు రోజూ మూడు ట్యాంకర్ల నీళ్లను జలమండలి సరఫరా చేసింది. నెలకు సుమారు 4.50లక్షల లీటర్ల నీళ్లను సరఫరా చేశారు. ప్రస్తుతం ఇంటిని ఖాళీ చేయగా నీళ్లను పూర్తిగా నిలిపివేశారు.

ఇదిలా ఉండ‌గా... ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు క్యాంప్‌ ఆఫీసును నగరంలోని లేక్‌ వ్యూ గెస్ట్‌ హౌస్‌ ను కేటాయించారు. ఈ క్యాంప్‌ ఆఫీసుకు రెండు నల్లా కనెక్షన్లు ఉన్నాయి. 25ఎంఎం సైజ్‌ పైపు కనెక్షన్‌ ద్వారా నెలకు 1.66లక్షల లీటర్ల నీళ్లను సరఫరా చేస్తుండగా, 20ఎంఎం సైజ్‌ పైపు కనెక్షన్‌ ద్వారా నెలకు 65వేల లీటర్ల నీళ్లను సరఫరా చేస్తున్నారు. మొత్తంగా ఏపీ సీఎం క్యాంప్‌ ఆఫీసుకు 2.31లక్షల లీటర్ల నీళ్లను జలమండలి సరఫరా చేస్తోంది. ఏపీ రాష్ట్రానికి సీఎంగా చంద్రబాబునాయుడు కొనసాగినప్పటి నుంచి కార్యక్రమాలన్నీ విజయవాడలోని క్యాంప్‌ ఆఫీసు నుంచే నిర్వర్తిస్తున్నారు. నీళ్లు నిలిపివేయ‌డంపై విస్మ‌యం వ్య‌క్తం చేయ‌డం స‌రికాద‌ని... చంద్ర‌బాబు ప‌రిపాల‌న కోసం రావ‌డం లేదు కాబ‌ట్టే తాము నీళ్లు నిలిపివేశామని అధికారులు చెప్తున్నారు.
Tags:    

Similar News