మరో దారుణం చోటు చేసుకుంది. అత్యాచారాలకు దేశ రాజధాని అడ్డాగా మారిందన్న విమర్శలు ఎదురవుతున్న వేళ.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన కారులో అత్యాచారం జరిగిన ఉదంతం ఇప్పుడు సంచలనం గామారింది. కదులుతున్న కారులో ఒక యువతి మీద అత్యాచారం జరిగింది. దీనికి సంబంధించి ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విస్మయకరమైన విషయం ఏమిటంటే.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన స్టిక్కర్.. అత్యాచారం జరిగిన కారుకు ఉండటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో అత్యాచారం చేసింది హోం శాఖకు చెందిన డ్రైవరా? లేక.. నకిలీ స్టిక్కర్ ను అంటించారా? అన్నది ప్రశ్నగా మారింది. ఇప్పటివరకూ అందిన సమచారాన్ని చూస్తే.. ఉద్యోగం కోసం ఢిల్లీకి వచ్చిన ఒక యువతిని గురువారం రాత్రి ఎయిమ్స్ సమీపంలో ఉండగా.. లిఫ్ట్ ఇస్తానని ఒక టాక్సీ డ్రైవర్ ఎక్కించుకున్నాడు.
నోయిడా వరకూ లిఫ్ట్ ఇస్తానని నమ్మబలికిన సదరు డ్రైవర్.. మోతీబాగ్ సమీపంలో కారును ఆపి బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అదేసమయంలో పెట్రోలింగ్ కోసం వచ్చిన పోలీస్ వాహనాన్ని చూసిన నిందితుడు.. కారును వదిలేసి పారిపోయాడు. దీంతో.. పోలీసులు వాహనంలోని యువతిని దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కు తరలించారు. వెనువెంటనే.. రంగంలోకి దిగిన పోలీసులు.. కొద్ది గంటల్లోనే నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు హోం శాఖకు సంబంధించిన ఉద్యోగా? లేక.. నకిలీ స్టిక్కర్ ను అంటించాడా? అన్నది తేలాల్సి ఉంది. ఏది ఏమైనా కేంద్ర హోం శాఖకు చెందిన కారులోనే రేప్ జరగటం చూస్తే.. దేశ రాజధానిలో భద్రత ఎంత దారుణంగా ఉందన్న విషయం ఇట్టే అర్థమవుతుందని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/