ఇప్పుడంతా కరోనానే. ఎక్కడ చూసినా ఆ మహమ్మారి గురించే చర్చ. తొలుత కరోనా మీద భయాందోళనలకు గురైన వారు.. ఇప్పుడు దాని గురించి అవగాహన కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తమ టాలెంట్ ను బయటకు తీస్తున్నారు. పుణ్యం.. పురుషార్థం అన్న చందంగా తాము చేసిన ప్రయత్నాల్ని వాట్సాప్.. సోషల్ మీడియా లో పోస్టు చేస్తున్నారు. ఏ మాత్రం విషయం ఉన్నా.. ఇట్టే అక్కున చేర్చుకునే సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పటికే చాలా మంది ఓవర్ నైట్ సెలబ్రిటీలు అయ్యారు. తాజాగా కరోనాతో కంగారు పడుతున్న వేళ.. దానికి సంబంధించిన ఒక పాటను పాడిన యువతి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. వేలాది మంది ఈ పాటను చూసి.. కరోనా ఫియర్ నుంచి కాస్త రిలీఫ్ అయ్యామంటున్నారు.
కరోనా నేపథ్యంలో.. ఆ భయంకరమైన వైరస్ గురించి ఒక పాట పాడిన రష్మీ సర్వీ ఇప్పుడు పాపులర్ గా మారారు. 85 సెకన్ల నిడివి ఉన్న బుల్లి వీడియోను పోస్టు చేసిన ఆమె.. చిటికెలు వేస్తూ.. పాడిన పాట ఇప్పుడు అందరిని విపరీతంగా ఆకర్షిస్తోంది. రెండేళ్ల క్రితం 2018లో హాలీవుడ్ సింగర్ కామిలా కాబెల్లో పాడిన హవానా పాటను కరోనాగా మార్చిన ఆమె.. ఈ వ్యాధి గురించి ఆందోళన చెందొద్దు.. అవగాహన పెంచుకోండంటూ చేసిన ప్రయత్నం అందరిని ఆకర్షిస్తోంది.
ఇప్పుడీ పాట పాపులర్ కావటమే కాదు.. వైరల్ గా మారింది. టాలెంట్ ను వెంటనే గుర్తించి.. వారిని సర్ ప్రైజ్ చేసే ప్రముఖ పారిశ్రామికవేత్త మహింద్రా గ్రూపు సంస్థల యజమాని ఆనంద్ మహింద్రా సైతం ఫిదా అయ్యారు. ఆయన కూడా ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. రష్మీని పొగిడేసిన ఆయన.. ఆమె పాట వినోదభరితంగా ఉందని.. ఆమె గొంతు చాలా బాగుందన్నారు. మీరో పెద్ద స్టార్ కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.
రష్మీ పాడిన రీమేక్ సాంగ్ ఇప్పుడు పాపులర్ కావటమే కాదు.. పలువురు షేర్ చేస్తున్నారు. ఈ పాటతో కరోనా ఫియర్ నుంచి రిలీఫ్ ఇవ్వటమే కాదు..అవగాహన పెంచుతుందన్న మాట పలువురు తమ కామెంట్ల రూపంలో పెడుతున్నారు.ఆనంద్ మహింద్రా తన పాటను ట్వీట్ చేసి.. పొగడటాన్ని తాను ఊహించలేకపోతున్నానని.. ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లుగా పేర్కొంది రష్మి. ఇంతకీ..ఆమె పాడిన కరోనా పాట విన్నారా?
వీడియో కోసం క్లిక్ చేయండి