ఆడవాళ్లకు ఇలాంటి మగాడే కావాలంట.!

Update: 2020-02-04 01:30 GMT
పెళ్లంటే నూరేళ్ల పంట..అయ్యాక ‘మంట’ అనుకునేవారు చాలా మంది. అయితే దేశంలో అత్యంత ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది పెళ్లికే.. మంచి మొగుడు/పెళ్లాం దొరికితే ఆ జీవితం సుఖమయం.. అదే తేడాగాళ్లు దొరికితే నరకమే.. సుఖ సంసారానికి దూరమై.. విడాకులతో భారమైన జీవితం గడుపుతారు. నచ్చనివారిని చేసుకుంటే జీవితాంతం నరకమే..

ప్రస్తుత సమాజంలో విడాకులు - విడిపోవడం అనేది కామన్ గా మారిపోయింది. అయితే అది మనసుపై రేపే గాయం మాత్రం చాలా గట్టిగా ఉంటోంది. అందుకే నేడు పెళ్లిళ్లు అనగానే అటు ఏడు తరాలు.. ఇటు ఏడుతరాలు.. పెళ్లి విషయంలో చాలా విషయాలను చూసి మరీ అబ్బాయి/అమ్మాయిని ఎంపిక చేసుకున్నారు. పెళ్లి విషయంలో ఆడపిల్లల వారు ఎన్నో కండీషన్స్ పెడుతున్నారు.

ప్రస్తుతం సమాజంలో ట్రెండ్ మారింది. నూరేళ్లు కలిసి ప్రయాణించే జీవిత భాగస్వామని ఎంచుకునేందుకు అతడితో కలిసి ఏడడుగులూ నడిచేందుకు ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు.. పెళ్లి విషయంలో అమ్మాయిల మనోభావాల్లో స్పష్టమైన మార్పు వచ్చిందని తాజా సర్వే తేల్చింది.

అ కాలం అమ్మాయిలు ఉమ్మడి కుటుంబాలను ఇష్టపడడం లేదట..నలుగురితో కలిసుంటే స్వేచ్ఛ ఉండదని.. ఒంటరిగా భర్తతో కలిసుండాలని వారు కోరుకుంటున్నారట.. అందుకే ఎలా జంజాఠం లేని అబ్బాయిలనే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారట.. ఇక నచ్చిన మగాడు దొరికితే కులం - మతం - జాతకం వంటి వాటిని మహిళలు అస్సలు పరిగణలోకి తీసుకోవడం లేదట..

ఇకే ప్రొఫెషన్ లో ఉన్న వారిని అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడుతున్నారట.. తర్వాత అందాన్ని చూస్తున్నారట.. 80శాతం మంది యువతులు మంచి ఆస్తిపాస్తులున్న అబ్బాయి కావాలని సర్వేలో కోరుకున్నారు.65శాతం మంది కుల మతాలతో పని లేదని.. 50శాతం జాతకాలు చూడాలని కోరుకున్నారు.
Tags:    

Similar News