మనదేశంలో రైళ్లు.. బస్సుల్ని ప్రజారవాణాగా తరచూ వినియోగిస్తామో.. అమెరికాలో విమానాల వినియోగం అదే తీరులో ఉంటుంది. ఒక ప్రదేశానికి మరో ప్రదేవానికి మధ్య దూరం ఎక్కువగా ఉండటంతో.. విమాన ప్రయాణాల మీద అమెరికన్లు ఎక్కువగా ఆధారపడే విషయం తెలిసిందే.
ఈ కారణంతోనే.. విమాన సర్వీసులు భారీగా ఉంటాయి. అంతేకాదు.. విమానాలకు సంబంధించి సమయపాలన కూడా చాలా ఎక్కువ. అలాంటిది తాజాగా వాషింగ్టన్.. న్యూయార్క్ ఎయిర్ పోర్ట్ లలో చోటు చేసుకున్న సాంకేతిక లోపం కారణంగా 400 పైగా విమానాలు ఆగిపోయాయి. సాంకేతిక లోపాన్ని సరిదిద్దేందుకు అధికారులు విపరీతంగా ప్రయత్నిస్తున్నారు.
వందలాది విమాన రాకపోకలు నిలిచిపోవటంతో ఆయా ఎయిర్ పోర్ట్ లలోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందికి గురి అవుతున్న పరిస్థితి. సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు యుద్ధ ప్రాతిపదిన ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నా.. పరిష్కారం మాత్రం ఇంకా లభించలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విమాన ప్రయాణాలున్న ప్రయాణికులు అలెర్ట్ గా ఉండాలని చెబుతున్నారు.