ఐపీఎల్, ఫుట్ బాల్, కబడ్డీ, ఇలా ఆటలపై ఫ్రాంఛైజీలు పెట్టి ఆ క్రీడలను ప్రోత్సహిస్తున్నాయి ఆ క్రీడా సంస్థలు. తాజాగా వీటి జాబితాలోకి ‘ఖోఖో’ కూడా వచ్చి చేరింది. ఐపీఎల్ సందడి ముగియగానే తాజాగా ఖోఖలో లీగ్ టోర్నమెంట్ ఆరంభం కాబోతోంది. ఐపీఎల్ తరహాలోనే అల్టిమేట్ ఖోఖో టోర్నమెంట్ పేరుతో ప్రతి సంవత్సరం నిర్వహించే టోర్నమెంట్ ఇదీ. వరుసగా రెండేళ్ల పాటు పట్టాలెక్కలేదు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని గత రెండు సీజన్లను రద్దు చేశారు.
ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో ఈ టోర్నమెంట్ ను డాబర్ గ్రూప్ చైర్మన్ అమిత్ బర్మన్ ప్రమోట్ చేస్తున్నారు. సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా ఈ టోర్నీని బ్రాడ్ కాస్ట్ చేస్తుంది.
ఇప్పుడు తాజాగా మరో రెండు ఫ్రాంచైజీలు తెరమీదకు వచ్చాయి. ఇందులో ఒకటి తెలంగాణ నుంచి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ అల్టిమేట్ ఖోఖో ఫ్రాంచైజీని జీఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ కిరణ్ కుమార్ గ్రంథి వెల్లడించారు.
దేశీయ పారిశ్రామిక దిగ్గజం గ్రంథి మల్లికార్జున రావు సారథ్యంలోని గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఇవీ. ఇప్పటికే జీఎంఆర్ కు ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ టీంలో వాటాలున్నాయి. 50 శాతం ఇన్వెస్ట్ మెంట్ ఇదే. ఇక తెలంగాణ ఖోఖో ఫ్రాంచైజీ కోసం ఎంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టిందనేది వెల్లడించలేదు.
గుజరాత్ ను అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీలు కొనుగోలు చేసింది. ఇదివరకూ ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేయడానికి గౌతం అదానీ సారథ్యంలోని ఈ గ్రూప్ ప్రయత్నాలు చేసింది కానీ.. అవి ఫలించలేదు.
అదానీ గ్రూప్ కు ఇప్పటికే ఇండియన్ బాక్సింగ్ లీగ్, కబడ్డీ లీగ్ ఫ్రాంచైజీలున్నాయి. ఇప్పుడు తాజాగా ఖోఖో ఫ్రాంచైజీ వచ్చి చేరింది. సంప్రదాయబద్దమైన గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడంలో తాము ఎప్పుడూ ముందుంటామని అదానీ ఎంటర్ ప్రైజెస్ తెలిపింది.