తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలంటూ ఉద్యమం నడుస్తున్న వేళ.. పార్టీలు ఏవైనా.. నేతలు ఎవరైనా సరే.. తెలంగాణ అంశానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడాలంటే చాలానే ఆలోచించేవారు. ఇక.. తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతల సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. ఒకవేళ.. తెలంగాణ ప్రాంతానికి చెందిన నేత ఎవరైనా తెలంగాణ పోరాటానికి దన్నుగా నిలవటం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని తెలిసినా.. కనిపించినా సదరు నేత పరిస్థితి దారుణంగా మారేది. అలాంటి నేతలు తెలంగాణలో తిరిగే అవకాశం కూడా ఉండేది కాదు.
తెలంగాణ గురించి బలంగా గళం విప్పి కూడా.. చాలామంది తెలంగాణ నేతలు తెలంగాణలో స్వేచ్ఛగా తిరిగేందుకు జంకేవారు. ఎవరు ఎక్కడ నిలదీస్తారన్న భయంతో వారు అయితే ఢిల్లీ.. లేదంటే హైదరాబాద్ లో కాలం గడిపేవారు. ఒకవేళ ఏదైనా అవసరంతో నియోజకవర్గానికి వెళ్లాల్సి వస్తే.. ఎన్నో జాగ్రత్తలు తీసుకునే వారు. ఇదంతా గతం. ఇక.. వర్తమానంలోకి వస్తే.. తెలంగాణ నేతలు తాము అనుకున్నవి అనుకున్నట్లుగా సాధిస్తుంటే.. ఏపీ నేతలు మాత్రం తమకు న్యాయంగా దక్కాల్సినవి కూడా ఎందుకు దక్కించుకోలేకపోతున్నారన్న ప్రశ్న ఒకటి తరచూ వినిపిస్తూ ఉంటుంది.
దీనికి సూటి సమాధానం చెప్పాలంటే.. సోమవారం లోక్ సభలో చోటు చేసుకున్న సీన్ ఒకటి చూస్తే.. విషయం ఇట్టే అర్థమవుతుంది. ఏపీకి జీవన్మరణ సమస్య లాంటి ప్రత్యేక హోదా అంశంపై ఏపీ అధికారపక్ష నేతలు దగ్గర నుంచి ప్రతి పార్టీ తీవ్రస్థాయిలో నిరసన గళం విప్పుతోంది. ఈ సందర్భంగా బీజేపీనేతలు మాత్రం పెదవి విప్పకుండా జాగ్రత్తగా ఉంటున్నారు. ఇక. సోమవారం లోక్ సభలో తెలుగుదేశం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు ప్రత్యేక హోదా అంశాన్ని సభ దద్దరిల్లేలా చేయటమే కాక.. తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీకి చెందిన బీజేపీ ఎంపీలు కంభంపాటి హరిబాబు.. గోకరాజు గంగరాజులు మాత్రం తమ స్థానాల్లో నుంచి కనీసం లేవను కూడా లేవలేదు. ఒక విధంగా చెప్పాలంటే తమకు సంబంధం లేని అంశమన్నట్లుగా వారు వ్యవహరించారు. బీజేపీ సభ్యులే అయినా.. తమకు ఓట్లు వేసి.. సభకు పంపింది ఆంధ్రోళ్లన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోయినట్లుగా కనిపించింది. ఏపీకి న్యాయంగా రావాల్సిన వేమీ రాకపోవటానికి ఈ తరహా నేతల వైఖరి అని చెప్పొచ్చు. ఓపక్క హోదా కోసం తమ రాష్ట్రానికి చెందిన పార్టీలన్నీ తీవ్రస్థాయిలో పోరాడుతున్న వేళ.. తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించిన ఏపీ బీజేపీ ఎంపీల తీరును సీమాంధ్రులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్న మాటను పలువురు సీమాంధ్రులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల్ని పట్టించుకోని వారిని.. వాటిపై గళం విప్పని నేతల్ని ఎక్కడికక్కడ నిలదీసే కార్యక్రమాన్ని సీమాంధ్రులు షురూ చేస్తే తప్ప.. నేతలు సెట్ అయ్యేటట్లు కనిపించట్లేదని చెప్పాలి. సీమాంధ్రులకు ప్రాణవాయువు లాంటి హోదా విషయంలో హరిబాబు.. గంగరాజులు వ్యవహరించిన తీరును చూస్తే.. సీమాంధ్రుడికి అసలు శత్రువులు ఎవరో ఇట్టే అర్థమవుతుందని పలువురు సీమాంధ్రులు వ్యాఖ్యానించటం గమనార్హం.