గంటాకు షాకిచ్చిన ట్రిపుల్ ఐటీ కుర్రాడు

Update: 2018-01-19 05:39 GMT
ఏపీలో విద్యా వ్య‌వ‌స్థ ఎంత దారుణంగా ఉందో తెలియ‌జేసే ఉదంతం ఒక‌టి చోటు చేసుకుంది. ఏపీ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావుకు దిమ్మ తిరిగే షాక్ త‌గిలింది. ఊహించ‌ని ఈ ప‌రిణామానికి నూజివీడు ట్రిపుల్ ఐటీ ప్రాంగ‌ణం వేదికైంది. చ‌దువుల్లో బెస్ట్ అయిన ఓ విద్యార్థి నోటి నుంచి వ‌చ్చిన మాట‌ల‌కు మంత్రి గంటా ఉలిక్కిప‌డ్డారు.

ఇప్పుడు కాదు కానీ.. నా ప‌ర్స‌న‌ల్ ఫోన్ నెంబ‌రు ఇస్తున్నా.. నాకు ఫోన్ చేసి డిటైల్డ్ గా మాట్లాడ‌న్న ప‌రిస్థితి ఎందుకు వ‌చ్చింది? ఇంత‌కీ ఆ విద్యార్థి ఏ అంశాన్ని చెప్పాడు? అన్న వివ‌రాల్లోకి వెళితే.. నూజివీడు ట్రిపుల్ ఐటీ లో జ‌రుగుతున్న ఆర్ జీయూకేటీ 3వ స్నాత‌కోత్స‌వానికి ఏపీ రాష్ట్ర మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖా మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు హాజ‌ర‌య్యారు.

మంచి మార్కులు సాధించి బంగారు ప‌త‌కాలు పొందిన విద్యార్థుల‌కు  ప‌త‌కాల్ని అంద‌జేశారు. అనంత‌రం వ‌స‌తి గృహానికి చేరుకున్నారు. బంగారు ప‌త‌కం సాధించిన శివ‌కుమార్ అనే విద్యార్థి అక్క‌డ‌కు చేరుకొని మంత్రి గంటా వ‌ద్ద‌కు వెళ్లారు. సార్‌.. మీరిచ్చిన గోల్డ్ మెడ‌ల్ మాష్టార్ల వ‌ల్ల రాలేదు. సీనియ‌ర్లు ఇచ్చిన స‌ల‌హాలు పాటించి.. నేను త‌యారు చేసుకున్న ప్ర‌ణాళిక‌తో క‌ష్ట‌ప‌డి చ‌ద‌వి విజేత‌ను అయ్యాన‌ని చెప్ప‌టంతో పాటు.. ట్రిపుల్ ఐటీలో విద్యా బోధ‌న ఎంత లోప‌భూయిష్టంగా ఉందో చెప్పేశాడు.

దీంతో షాక్ తిన్న గంటా వెంట‌నే స‌ర్దుకొని .. త‌న ప‌ర్స‌న‌ల్ ఫోన్ నెంబ‌రు ఇస్తున్నాన‌ని.. త‌ర్వాత త‌న‌తో ఫోన్ లో మాట్లాడాల‌న్నారు. ఈ సంద‌ర్భంగా శివ‌కుమార్‌ కు.. మంత్రి గంటాకు మ‌ధ్య కాసేపు మాట‌లు న‌డిచాయి. మంత్రితో ఏం మాట్లాడార‌న్న విష‌యాన్ని శివ‌కుమార్ బ‌య‌ట‌కు వెల్ల‌డించేందుకు నిరాక‌రించారు. ఇదిలా ఉంటే.. ఊహించ‌ని రీతిలో మంత్రి దృష్టికి ఒక గోల్డ్ మెడ‌ల్ స్టూడెంట్ చేసిన కంప్లైంట్ వ్య‌వ‌హారం నూజివీడు ట్రిపుల్ ఐటీ యాజ‌మాన్యానికి షాకింగ్ గా మారింది. ఆ వెంట‌నే దిద్దుబాటు చ‌ర్య‌ల్ని షురూ చేసింది. మంత్రి కంప్లైంట్ చేసిన విద్యార్థి నూజివీడు క్యాంప‌స్ విద్యార్థి కాద‌ని..వేరే క్యాంప‌స్ నుంచి వ‌చ్చిన‌ట్లుగా చెప్పే ప్ర‌య‌త్నం చేయం గ‌మ‌నార్హం. ఇదిలా ఉండ‌గా.. మంత్రి గంటా ఈ వ్య‌వ‌హారంపై సీరియ‌స్ అయ్యారు. స‌మ‌గ్ర విచార‌ణ‌కు ఆదేశించిన‌ట్లుగా వెల్ల‌డించారు. నిజ‌మే.. ఒక కుర్రాడు చెప్పే వ‌ర‌కూ మంత్రికి ట్రిపుల్ ఐటీ ఆరాచ‌కాలు తెలీదంటే.. ఏం చెప్పాలి?
Tags:    

Similar News