కరోనా మహమ్మారి విజృంభణకి కన్నుమూసేవారు కొందరైతే .. కరోనాతో పోరాడుతూ ఆసుపత్రి లో సిబ్బంది సరైన సమయంలో సరైన విధంగా స్పదించక మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక్కడ ఊపిరి ఆడటంలేదు .. ఆక్సిజన్ పెట్టమని అడిగితే .. అయిపోయిందన్నారు..ఊపిరి ఆడటం లేదని ఎంతగా వేడుకుంటున్నా పట్టించుకోవడం లేదు అంటూ ఆ బాధితులు కన్నుమూశారు. వారిలో ఒకరు గాంధీ ఆసుపత్రిలో మృతిచెందితే , మరొకరు అంబులెన్స్‌లోనే కన్నుమూశారు. ఒకరు 33 ఏళ్ల యువకుడు కాగా.. మరొకరు 9 నెలల నిండు గర్భిణి. దీనితో ఆ భాదితుల కుటుంబ సభ్యులు వైదులు , సిబ్బంది నిర్లక్ష్యం వల్లే మా కుటుంబ సభ్యులు మరణించారని ఆరోపణలు చేస్తున్నారు.
ఈ ఘటన పై పూర్తీ వివరాలు చూస్తే....గొల్ల శ్రీధర్ అనే వ్యక్తి హైదరాబాద్ నేరేడ్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్ లో నివాసం ఉంటూ ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయనకి భార్య, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. ఇతనికి ఐదు రోజుల క్రితం ఊపిరి తీసుకోవడం కొంత ఇబ్బందిగా ఉంటే , ఉస్మానియా లో జాయిన్ అయ్యాడు. అక్కడ మూడు రోజులు ఉన్న తరువాత ..కరోనా పాజిటివ్ గా తేలడంతో అతన్ని మంగళవారం మధ్యాహ్నం గాంధీకి తరలించారు. గాంధీకి వెళ్లినప్పటి నుండి శ్వాస సంబంధ సమస్యతో తీవ్ర ఇబ్బంది పడ్డాడు. బుధవారం తెల్లవారుజామున 3.30 గంటలకు బంధువులకు ఫోన్ చేసి ఆసుపత్రిలో ఆక్సిజన్ అయిపోయిందన్నారు.. ఊపిరి ఆడటం లేదని ఎంతగా వేడుకుంటున్నా నన్ను పట్టించుకోవడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ తరువాత గంటకే తుదిశ్వాస విడిచాడు అని కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపించారు.
కుటుంబ సభ్యుల వాదన ఇలా ఉంటే ..గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం.రాజారావు వాదన మరోలా ఉంది. అయన మాట్లాడుతూ .. గాంధీ ఆసుపత్రిలో ఆక్సిజన్ కు ఎలాంటి కొరత లేదని, ఆసుపత్రిలో 2,660 మంది రోగులకు నిత్యం ఆక్సిజన్ అందించే సామర్థ్యం ఉంది అని తెలియజేసారు. అయితే , గాంధీలో పొరుగు సేవల సిబ్బంది ఆందోళన చేపట్టిన నేపథ్యంలో నర్సుల ద్వారా అందాల్సిన సేవల్లో కొంత జాప్యం చోటు చేసుకోవడంతో అయన మృతి చెంది ఉండచ్చు అని తెలిపారు.
Full View