ఐఐటీ చదవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఒక్కసారి ఐఐటీ లో కోర్స్ పూర్తి అయ్యి , బయటకి వస్తే ఆ జీవితం మరోలా ఉంటుంది. కానీ, ఐఐటీల లో సీటు రావడం అంటే అంత ఈజీ కాదు. కానీ , ఐఐటీలలో చదవాలనే విద్యార్థినిలకు ఇది గుడ్ న్యూస్. ఐఐటీలో చదవాలనే అమ్మాయిలకు మహిళా కోటా కింద ఇప్పటికే ఉన్న 20శాతం రిజర్వేషన్లకు అదనంగా మరికొన్ని సీట్లు కేటాయించనుంది. సూపర్ న్యూమరీ పద్ధతిలో ఐఐటీలు ఈ సీట్లను కేటాయించనుంది. ఐఐటీల్లో అదనపు సీట్ల కేటాయింపు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లపై ఎలాంటి ప్రభావం చూపదని అధికారులు చెప్పారు.
అలాగే అమ్మాయిలు తమకు ఇష్టమొచ్చిన క్యాంపస్ సెలెక్ట్ చేసుకునేలా ఓ ప్రత్యేక మెరిట్ లిస్టుకూడా తయారు చేయబోతున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా 2014–15లో జేఈఈ అడ్వాన్స్‌డ్ లో అర్హత సాధించిన అమ్మాయిల్లో కేవలం 8 శాతం మందికే ఐఐటీల్లో సీట్లు లభించాయి. 2015–16లో జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో దాదాపు 4,600 మంది అమ్మాయిలు అర్హత సాధిస్తే అందులో 850 మందికే సీట్లు వచ్చాయి.2016–17 విద్యా సంవత్సరంలోనూ దాదాపు అదే పరిస్థితి నెలకొంది. 2017–18 ప్రవేశాల లెక్కల ప్రకారం ఐఐటీల్లో 9.15 శాతం మంది అమ్మాయిలకే సీట్లు లభించాయి. ఈ నేపథ్యంలో ఐఐటీల్లో అమ్మాయిల సంఖ్య పెంచేందుకు ఐఐటీ మండి క్యాంపస్ డైరెక్టర్ గొన్సాల్వేస్ నేతృత్వంలోని ఓ కమిటీ కొన్ని కీలక విషయాలను గుర్తించింది.
ఐఐటీలకు క్వాలిఫై అవుతున్న విద్యార్థుల్లో అబ్బాయిల సంఖ్యతో పోలిస్తే అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉందని, అలాగే ఒకవేల ఐఐటీల్లో క్వాలిఫై అయినప్పటికీ కొందరు ఐఐటీ క్యాంపస్ దూరంగా ఉండటంతో ఐఐటీల్లో చేరేందుకు విముఖత చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మ్మాయిలు తమకు ఇష్టమొచ్చిన క్యాంపస్ సెలెక్ట్ చేసుకునేలా వెసులుబాటు కల్పిస్తున్నారు. ఇదిలా ఉంటే విదేశీ విద్యార్థులకు ఐఐటీల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. ఇది కూడా సూపర్ న్యూమరీ పద్దతిలోనే కేటాయించడంతో అదనంగా 1100 సీట్లు విదేశీ విద్యార్థులకు వెళ్లనున్నాయి. ఐఐటీల్లో అడుగుపెట్టాలంటే విదేశీ విద్యార్థులకు జేఈఈ మెయిన్ క్లియర్ చేయాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ ఐఐటీల్లో విదేశీ విద్యార్థుల సంఖ్య ఇంకా తక్కువగానే ఉంది. అయితే భారతీయ విద్యార్థులకు మాత్రం ఇది తప్పని సరి. ఇక రిజర్వేషన్లను పక్కనబెడితే ఐఐటీ సీట్ల కేటాయింపుల్లో 15శాతం ఎస్సీలకు, 7.5శాతం ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది.